Dead Bodies Marriage : స్మశానంలో శవాలకు పెళ్లి చేసిన పెద్దలు..ఎందుకంటే

స్మశానంలోనే రెండు శవాలకు పెళ్లి చేశారు ఆ మృతదేహాలకు సంబంధించి కుటుంబాల పెద్దలు. ఈ వింత ఘటనకు సంబంధించిన కారణం పాతదే అయినా రెండు శవాలకు స్మశానంలోపెళ్లి చేయటం అనేది మాత్రం వింతనే చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే..

Dead Bodies Marriage : స్మశానంలో శవాలకు పెళ్లి చేసిన పెద్దలు..ఎందుకంటే

Parents Did Marriage Dead Bodies Of A Love Couple

parents did marriage dead bodies of a love couple : పెళ్లి స్వర్గంలో నిర్ణయింపబడతాయని పెద్దలు అంటారు. కానీ స్మశానంలో కూడా పెళ్లి చేయాలనే నిర్ణయాలు జరుగుతాయనే విషయం మీకు తెలుసా? పెళ్లి అంటే శుభాకార్యం. చావు అంటే కీడు. అటువంటిది శుభకార్యాన్ని స్మశానంలో ఎందుకుచేస్తారు?అని అనుకుంటాం. కానీ మహారాష్ట్రలోని మాడే గ్రామంలో జరిగింది ఇటువంటి వింత ఘటన. స్మశానంలోనే రెండు శవాలకు పెళ్లి చేశారు ఆ మృతదేహాలకు సంబంధించి కుటుంబాల పెద్దలు. ఈ వింత ఘటనకు సంబంధించిన కారణం పాతదే అయినా రెండు శవాలకు స్మశానంలోపెళ్లి చేయటం అనేది మాత్రం వింతనే చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే..

అది మహారాష్ట్రలోని మాడే గ్రామం. అదే గ్రామానికి చెందిన ముఖేష్ అనే యువకుడు, నేహా అనే యువతి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్లే.వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు. వేరు వేరు కులాలా అంటే అదీ లేదు. ఇద్దరికి ఒకే కులం. అయినా వారి కుటుంబాలవారు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ కుదరలేదు. ఇద్దరు వారి వారి పెద్దలతో పదే పదే మాట్లాడారు.కానీ ఫలితం లేదు.

దీంతో దినేష్, నేహాలు మనస్తాపానికి గురయ్యారు. బతికి ఉంటే వేరే వివాహం చేస్తారని కాబట్టి చావులోనైనా మనం కలిసే ఉందాం అనుకుని.. ఆదివారం (ఆగస్టు 1,2021) నేహా ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరి ఆత్మహత్యలు స్థానికంగా కలకలం రేపాయి. పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.పోస్టు మార్టం పూర్తి అయ్యాక మృతదేహాలను ఇరు కుటుంబాలకూ అందజేశారు.

వారి వివాహానికి ఒప్పుకోని పెద్దలు చేతులారా బిడ్డల్ని పోగొట్టుకున్నామని కుమిలిపోయారు.వారు బ్రతికి ఉండగా వారి కోరిక తీర్చలేకపోయాం.వారిని కలిసి ఉండనివ్వలేదు.కనీసం చనిపోయాకైనా వారి కోరిక తీర్చాలని అనుకున్నారు. అలా ఇరు కుటుంబాల పెద్దలూ మాట్లాడుకుని స్మశానంలో ఇద్దరి మృతదేహాలకు పెళ్లి చేశారు. రెండు మృతదేహాలకు పూల దండలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది ఆ గ్రామంలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అనవసరపు పంతాలకు పోయి బిడ్డల్ని పోగొట్టుకున్నారు.తరువాత బాధపడితే మాత్రం వస్తారా? జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకుంటున్నారు. వారి ప్రేమను ముందుగానే అంగీకరించి పెళ్లి చేస్తే ఇద్దరూ సంతోషంగా ఉండేవారు కదా అంటున్నారు.