పతంజలికి కోర్టు షాక్..రూ. 10 లక్షల ఫైన్..కరోనిన్ పేరు తొలగించాలి

  • Edited By: madhu , August 7, 2020 / 01:43 PM IST
పతంజలికి కోర్టు షాక్..రూ. 10 లక్షల ఫైన్..కరోనిన్ పేరు తొలగించాలి

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరోనిల్..రిజిస్టర్డ్ బ్రాండ్ నేమ్ పతంజలి ఎలా వాడుకుంటుందని ప్రశ్నించింది. కరోనిన్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.అంతేగాకుండా..కరోనా వైరస్ ను తొలగిస్తుందని చెప్పి ప్రచారం చేసుకున్నందుకు..రూ. 10 లక్షల ఫైన్ వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ బ్రాండ్స్ పై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని అర్ధురా ఇంజనీరింగ్ ప్రైవేటు లిమిటెడ్ వెల్లడించింది.

అసలు ఏం జరిగింది ?
కరోనా విస్తరిస్తున్న క్రమంలో వైరస్ ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు, వివిధ సంస్థలు మందులను కనిపెట్టే పనిలో పడిపోయారు. ఈ క్రమంలో…కరోనాకు మందు కనిపెట్టామని పతంజలి సంస్థ ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. కరోనిల్ పై ఎక్కడా కోవిడ్ 19 పేరు గానీ, కరోనా పేరు గానీ వాడకూడదని స్పష్టం చేసింది కేంద్రం.ఇదిలా ఉంటే…కరోనిల్ బ్రాండ్ పేరు తమదేనని, 1993లోనే రిజస్టర్ చేసుకున్నామని మద్రాసు హైకోర్టు తలుపు తట్టింది అర్దూర ఇంజనీరింగ్ ప్రైవేటు లిమిటెడ్. కేసు దాఖలు చేసింది. 2027 వరకు ఈ బ్రాండ్ నేమ్ ను ఎవరూ కూడా వాడుకోవడానికి వీలు లేదని, పతంజలి సంస్థ ఇప్పుడు ఈ పేరును వాడుకుందని కేసులో వెల్లడించారు.

రిజిస్టర్డ్ బ్రాండ్ నేమ్ ను పతంజలి ఎలా వాడుకుందని ప్రశ్నంచింది. కరోనిన్ పేరును తొలగించాలని కోరింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు తగు ఆదేశాలు జారీ చేసింది.