Petrol, Diesel Price : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు… అక్టోబర్ లో 23 సార్లు పెంపు

దేశంలో గతకొద్ది రోజులుగా చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.

Petrol, Diesel Price : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు… అక్టోబర్ లో 23 సార్లు పెంపు

Petrol (2)

Petrol and diesel prices hike : దేశంలో గతకొద్ది రోజులుగా చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటరు పెట్రోల్ పై 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.113.36 డీజిల్ రూ.106.60 పెరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లోని పలు పట్టణాల్లో లీటర్ పెట్రోల్ రూ.120, లీటర్ డీజిల్ రూ.110కు చేరింది.

అక్టోబర్ నెలలో 23 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 7 రూపాయలు పెరిగాయి. దేశంలో 14 రాష్ట్రాల్లో లీటర్ డీజిల్ ధర 100 దాటింది. కేరళ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, బెంగాల్, జమ్మూకాశ్మీర్ లేహ్‌లో డీజిల్ ధర 100 దాటింది.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై 200 కోట్ల పెట్టుబడులు.. ఇప్పుడు ఆ సినిమాల పరిస్థితి??

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్ల కు చేరింది. సెప్టెంబర్ నెల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 9-10 డాలర్లు పెరిగింది.