దివాళీ కోసం అణ్వాయుధాలు దాచామనుకున్నారా!

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2019 / 04:05 PM IST
దివాళీ కోసం అణ్వాయుధాలు దాచామనుకున్నారా!

పాకిస్తాన్‌ బెదిరింపులకు భయపడే వైఖరికి భారత్‌ స్వస్తి పలికిందని ప్రధానమంత్రి నరేం‍ద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని పాక్ తరచూ భారత్‌ ను బెదిరించే ప్రయత్నం చేస్తోందని, అలా అయితే భారత్‌ ఏమైనా తన అణ్వాయుధాలను దివాళీ కోసం దాచుకుందామనుకుందా అని మోడీ అన్నారు.

1971లో మన సైనికుల ధైర్యసాహసాల కారణంగానే పాక్ లోని పెద్ద భాగం మన ఆధీనంలోకి వచ్చిందని, 90వేల మంది పాక్ సైనికులు అప్పుడు మన కస్టడీలో ఉన్నారని కానీ అప్పటి ప్రభుత్వం  మన సైనికులు సాధించిన విజయాన్ని దుర్వినియోగం చేసిందని మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ను విమర్శించారు.అప్పుడు మోడీ కనుక అక్కడ ఉన్నట్లయితే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు.ఉగ్రవాదంపై రాజీలేని పోరాటాన్ని సమర్ధిస్తూ కమలం గుర్తుకు ఓటేయాలని ర్యాలీకి హాజరైన ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు.  గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పాకిస్తాన్‌తో సింధూ జలా ఒప్పందం అమలుకు ప్రయత్నించలేదని ఆరోపించారు.