PM Modi: మోదీ అధ్యక్షతన 29న కేంద్ర క్యాబినెట్‌ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ

వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 2024లో ‘వోట్ ఆన్ బడ్జెట్’ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరవుతారు.

PM Modi: మోదీ అధ్యక్షతన 29న కేంద్ర క్యాబినెట్‌ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ

PM Modi: రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వానికి సంబంధించి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశం.

Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 2024లో ‘వోట్ ఆన్ బడ్జెట్’ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరవుతారు. వీరిలో సహాయ మంత్రులు కూడా ఉంటారు. వీరికి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ తగిన సూచనలు చేస్తారు. మోదీ ప్రభుత్వానికి ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనవి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ బడ్జెట్‌ సమావేశాలు బీజేపీకి కీలకం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

California Shooting: క్యాలిఫోర్నియాలో దుండగుడి కాల్పులు.. పది మంది మృతి?

బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నిరంతరాయంగా పని చేయాలని మోదీ.. కేంద్ర మంత్రులకు సూచించనున్నారు. ఈ ఏడాది ఇండియా ప్రతిష్టాత్మంగా నిర్వహించనున్న జీ-20 సమావేశాలపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చిస్తారు. జీ-20 సమావేశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 50 చోట్ల 200కుపైగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాల్లో జీ-20 దేశాలతోపాటు ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొనబోతున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రుల శాఖల మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా క్యాబినెట్ భేటీలో మోదీ వివరించబోతున్నారు.