PM Modi : 77 మంది కేంద్ర మంత్రులు..8 గ్రూపులుగా విభజన, ఎందుకంటే

పాలనలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచే దిశగా మంత్రుల కార్యాలయాలు పనిచేయనున్నాయి.

PM Modi : 77 మంది కేంద్ర మంత్రులు..8 గ్రూపులుగా విభజన, ఎందుకంటే

Modi

77 Ministers Into 8 Groups : పనిలో వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 77 మంది కేంద్ర మంత్రులను ఎనిమిది గ్రూపులుగా విభజించారు. పాలనలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచే దిశగా మంత్రుల కార్యాలయాలు పనిచేయనున్నాయి. సాంకేతికతను వినియోగించుకోవడం, నిపుణులను ఎంపిక చేసుకుని పని చేయడం, వనరులను కేటాయించడం లాంటివి చేయనున్నారు. మోదీ నేతృత్వంలో చింతన్‌ శిబిర్‌ పేరుతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More : Nalgonda : ఉద్రిక్తతలను పెంచిన బండి సంజయ్ టూర్

మంత్రుల వ్యక్తిగత సామర్థ్యం,  మంత్రిత్వ శాఖ పనితీరు, పార్టీ సమన్వయం, ప్రభావవంతమైన కమ్యూనికేషన్​​, పార్లమెంటరీ పద్ధతులు, వాటాదారుల ఎంగేజ్​మెంట్​పై సెషన్లు  జరిగాయి. ఎనిమిది గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో తొమ్మిది నుంచి పది మంది మంత్రులతో పాటు ఒక కేంద్ర మంత్రిని గ్రూప్ కోఆర్డినేటర్‌గా నియమించారు. ప్రతి  కేంద్ర మంత్రి కార్యాలయంలో కేంద్రం పథకాలు, విధానాల పనితీరుపై నవీకరణలను అందించే పోర్టల్‌ను అభివృద్ధి చేస్తారు.

Read More : Predator Drones : రూ.21వేల కోట్ల డీల్.. 30 డ్రోన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ

పరిశోధన, కమ్యూనికేషన్, తదితర కీలక రంగాలపై పనిచేయడానికి  ముగ్గురు యువ నిపుణుల బృందాన్ని మంత్రుల కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నారు.  పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలు, అనుభవాలను నిర్వహించే పోర్టల్‌ను రూపొందించనున్నారు. ఇక ప్రతీ మంత్రిత్వ శాఖలో పోర్టల్​లను ఏర్పాటు చేయనున్నారు. 2024 ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో మంత్రిత్వ కార్యాలయాల పనితీరులో వేగం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.