దేశాన్ని ముక్కలు కానివ్వను : మోడీ 

  • Published By: chvmurthy ,Published On : April 14, 2019 / 10:42 AM IST
దేశాన్ని ముక్కలు కానివ్వను : మోడీ 

కథువా: ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దేశాన్ని ముక్కలు కానివ్వనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడూతూ… జమ్మూకాశ్మీర్ కు చెందిన నాయకులు ఒమర్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీలు దేశాన్ని రెండుగా చీల్చటానికి చూస్తున్నారని ఆరోపించారు. వీళ్ల కుటుంబ రాజకీయాల వల్ల మూడు తరాల జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. వారికి రాజకీయంగా విశ్రాంతి ఇస్తేనే జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవితాలు బాగుపడతాయని మోడీ అన్నారు. 

కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కాశ్మీరీ పండిట్లు తమ జన్మభూమిని వదిలివేశారని ఆయన చెప్పారు. కాశ్మీరీ పండిట్ల సమస్య పరిష్కారానికి తాను కట్టుబడి ఉన్నానని, ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కాశ్మీరీ పండిట్లను వారి స్వస్ధలాలకు పంపే ఏర్పాటు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. భారత్ పై నమ్మకంతో ఇక్కడకు వచ్చిన కుటుంబాలకు సిటిజన్ షిప్ ఇచ్చేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు మోడీ చెప్పారు.