విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : April 24, 2019 / 07:07 AM IST
విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు

విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ నిన్న ఉదయం నుంచి ఈవీఎమ్ లను తిట్టడం ప్రారంభించారు.దీన్ని బట్టి చూస్తుంటే వాళ్లు తమ ఓటమిని ఈవీఎమ్ లపై నెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
Also Read : బీజేపీకి షాక్ : కాంగ్రెస్ లో చేరిన ఎంపీ ఉదిత్ రాజ్

ఎగ్జామ్ సరిగా రాయని ఓ విద్యార్థి ఇంటికి వచ్చి పెన్ను సరిగా,అది సరిగా లేదు,ఇది సరిగా లేదు అంటూ సాకులు చెబుతుంటారు.విపక్షాల పరిస్థితి కూడా అలాగే ఉందని మోడీ అన్నారు.విపక్షాలు కూడా బీజేపీ గెలుపును అంగీకరించాయని మోడీ తెలిపారు.మే-23న ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా వస్తాయని,మరోసారి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని మోడీ అన్నారు.నక్సల్స్,మావోయిస్టులను కట్టడి చేయగలిగామని మోడీ తెలిపారు.