మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలి..మోడీ

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.

మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలి..మోడీ

Pm Modi

PM Modi దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాపై ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ప్రస్తుతమున్న పరిస్థితి సహా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో వచ్చే 15 రోజులకు అవసరమయ్యే ఆక్సిజన్‌పై సమీక్షలో చర్చించారు.

ఈ సందర్భంగా డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని మోడీ సూచించారు. ఆక్సిజన్​ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. ఇదే సమయంలో మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లు ఎలాంటి ఆటంకం లేకుండా 24 గంటలు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, రవాణా సంస్థలకు సూచించారు. ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ కేంద్రాలకు 24 గంటలు పనిచేసేందుకు అనుమతిస్తున్నట్లు మోడీ తెలిపారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌ దిగుమతికి చేస్తున్న ప్రయత్నాలను అధికారులు ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు.

మరోవైపు,కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఈ సమయంలో హాస్పిటల్స్ లో మెడికల్ ఆక్సిజన్ వృథా చేయవద్దని కేంద్రఆరోగ్యశాఖ ఇప్పటికే అన్నిరాష్ట్రాలకు సూచించింది. కరోనా పేషెంట్లకు కీలక సమయంలో అవసరమయ్యే మెడికల్ ఆక్సిజన్ ను హేతుబద్దంగా ఉపయోగించుకోవాలని,ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వృద్ధా చేమొద్దని సూచించింది. మెడికల్ ఆక్సిజన్ తయారీ పెంచాలని ఉత్పత్తి సంస్థలను ఆదేశించామని,దేశంలో ఆక్సిజన్ కొరత లేదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.