PM Modi: మానవత్వానికి వన్ ఎర్త్, వన్ హెల్త్… ఇదే మన మెసేజ్

కరోనా నుంచి ఎలా గట్టెక్కాలి.. ప్రపంచ దేశాలు పరస్పరం ఎలా సహకరించుకోవాలి అనే అంశం చర్చలో బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్ పేరుతో జీ7 సదస్సులో పాల్గొన్నాయి సభ్య దేశాలు. G7 సమ్మిట్‌లో భాగంగా ప్రధాని మోదీ నేరుగా పాల్గొనాల్సి ఉన్నా...

PM Modi: మానవత్వానికి వన్ ఎర్త్, వన్ హెల్త్… ఇదే మన మెసేజ్

Pm Modi Seeks G7 Support Gives One Earth One Health

PM Modi: కరోనా నుంచి ఎలా గట్టెక్కాలి.. ప్రపంచ దేశాలు పరస్పరం ఎలా సహకరించుకోవాలి అనే అంశం చర్చలో బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్ పేరుతో జీ7 సదస్సులో పాల్గొన్నాయి సభ్య దేశాలు. G7 సమ్మిట్‌లో భాగంగా ప్రధాని మోదీ నేరుగా పాల్గొనాల్సి ఉన్నా… ఇండియాలో సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా వెళ్లలేకపోయారు. ఈ క్రమంలో వర్చువల్ కాన్ఫిరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన జీ7 సభ్య దేశాలు, ఇతర ఆతిథ్య దేశాలకు అభినందనలు తెలిపారు.

ఇండియాలో సెకండ్ వేవ్ వల్ల ఎదురైన ఇబ్బందుల నుంచి దేశాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చాయని కొనియాడారు. కరోనా లాంటి మహమ్మారితో పోరాడేందుకు దేశమంతా ఒక్కతాటిపై నిలిచిందని తెలిపారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, సమాజంలో ప్రజలు అంతా కరోనాను ఎదుర్కోవడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

కాంట్రాక్ట్ ట్రేసింగ్, వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ వంటి విషయాల్లో ఓపెన్ సోర్స్ డిజిటల్ టూల్స్‌ని ఇండియా బాగా ఉపయోగించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలకు ఓ రోల్ మోడల్‌గా మారింది అన్నారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవాన్ని ఆ దేశాలకు ఇండియా పంచుతుంది అని అన్నారు.

యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ స్టేట్స్ లు పాల్గొన్న జీ7 సదస్సులో ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలు ఆతిథ్య దేశాలుగా పాల్గొన్నాయి. ఈ మేర ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. ‘G7 సదస్సు హెల్త్ సెషన్ లో పాల్గొన్నాను. రీసెంట్ కొవిడ్-19 వేవ్ సమయంలో సహాయపడ్డ వారందరికీ థ్యాంక్స్ తెలియజేశాను. భవిష్యత్ లో ఏదైనా సమస్య వస్తే సహాయపడేందుకు ఇండియా సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చాం. మానవత్వానికి మనమిచ్చే సందేశం ఒక్కటే వన్ ఎర్త్, వన్ హెల్త్’ అని ట్వీట్ ద్వారా వెల్లడించారు.

G7 సదస్సులో భాగంగా ఆదివారం మరో 2సెషన్స్ జరగనున్నాయి. అందులోనూ పాల్గొని మాట్లాడనున్నారు ప్రధాని మోదీ.