Rakesh Jhunjhunwala : హస్తిన పర్యటనలో బిగ్ బుల్..నిన్న మోదీ,నేడు నిర్మలమ్మతో భేటీ..అందరిలో ఆసక్తి

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ అయ్యారు.

Rakesh Jhunjhunwala : హస్తిన పర్యటనలో బిగ్ బుల్..నిన్న మోదీ,నేడు నిర్మలమ్మతో భేటీ..అందరిలో ఆసక్తి

Rakesh (1) (1)

Rakesh Jhunjhunwal ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా బుధవారం(అక్టోబర్-6,2021)కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ అయ్యారు. ఝున్‌ఝున్‌వాలాతో పాటు మరో ఇద్దరు కూడా నిర్మలా సీతారామన్ ని కలిసిన వారిలో ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను నిర్మలాసీతారామన్ ట్వీటర్ లో షేర్ చేశారు. అయితే ఈ భేటీలో ఏయే అంశాల గురించి వీరి మధ్య చర్చ జరిగిందన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరోవైపు, మంగళవారం ప్రధాని మోదీతో రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా భేటీ అయిన విషయం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న అంతర్దృష్టి ఉన్న వ్యక్తిని, అత్యంత చురుకైన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాని కలవడం సంతోషంగా ఉందంటూ మంగళవారం మోదీ ఓ ట్వీట్ చేశారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాని కలిసిన ఫొటోను మోదీ ట్విట్టర్ లో షేర్ చేశారు. రాకేష్‌తో పాటు ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా సైతం ఆ ఫొటోలో ఉండడం విశేషం. నలిగిన చొక్కాతో చాలా సాదాసీదాగా ఝున్‌ఝున్‌వాలా ఆ ఫోటోలో కనిపించారు.

ఇక,మోదీ-ఝున్‌ఝున్‌వాలా భేటీకి సంబంధించిన మరో ఫొటో కూడా ఒకటి బయటికొచ్చింది. ఆ ఫొటోలో.. ఝున్‌ఝున్‌వాలా కుర్చీలో కూర్చోగా.. తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ ఎదురుగా వినయంగా మోదీ చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

అయితే ఝున్‌ఝున్‌వాలాతో భేటీకి సంబంధించి ప్రధానిమోదీ, మంత్రి నిర్మలా సీతారామన్‌లు నేరుగా సోషల్‌ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్‌ చేశారు కానీ భేటీలో ప్రస్తావించిన అంశాలను తెలపడం లేదు. మార్కెట్‌ వ్యవహరాలు తప్పితే పెద్దగా ఇతర విషయాల్లో నేరుగా తల దూర్చని రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా తన శైలికి భిన్నంగా వరుసగా రెండు రోజులుగా హై ప్రొఫైల్‌ సమావేశాల్లో పాల్గొనడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా త్వరలో ఆకాశ పేరుతో ఎయిర్‌లైన్స్‌ సేవలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సహాకారం కోరేందుకే ఆయన ఢిల్లీ పర్యటనకు వచ్చి ఉంటారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇండియన్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటీ అనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయింది.

ALSO READ  25 ఏళ్లలో తొలిసారి..అమెరికా ధనవంతుల జాబితాలో ట్రంప్ కు దక్కని చోటు