PM Modi: యుక్రెయిన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్.. రష్యాతో శాంతి కోసం సాయం చేస్తామని హామీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మోదీ, జెలెన్‌స్కీ.. పలు అంశాలపై చర్చించినట్లు ప్రభుత్వం తెలిపింది.

PM Modi: యుక్రెయిన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్.. రష్యాతో శాంతి కోసం సాయం చేస్తామని హామీ

PM Modi: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రష్యాతో శాంతి స్థాపన విషయంలో ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. మంగళవారం జెలెన్‌స్కీతో మోదీ మాట్లాడినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.

Type-C Cable: చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లు.. ఇకపై అన్ని గాడ్జెట్లకు ఒకటే కేబుల్.. చట్టం చేసిన యురోపియన్ యూనియన్

ఈ సందర్భగా ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం.. రష్యా-యుక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని మోదీ అన్నారు. సైనిక చర్య దీనికి పరిష్కారం కాదని ప్రధాని అన్నారు. మరోవైపు అణు రక్షణ విషయంలో కూడా మోదీ హామీ ఇచ్చారు. దేశంలోని అణ్వస్త్ర ప్రదేశాలతోపాటు, యుక్రెయిన్‌లోని అణ్వస్త్ర ప్రదేశాల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు.

అణ్వస్త్ర ముప్పు వల్ల పర్యావరణం, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, సహకారం వంటి అంశాలపై మోదీ, జెలెన్‌స్కీ చర్చించారు. ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో జెలెన్‌స్కీకి ప్రధాని ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.