మోడీ ప్రధాన సలహాదారు పీకే సిన్హా రాజీనామా

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన సలహాదారు ప్రదీప్ కుమార్ సిన్హా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

మోడీ ప్రధాన సలహాదారు పీకే సిన్హా రాజీనామా

Pm Modis Principal Advisor P K Sinha Resigns Sources

P K Sinha resigns ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన సలహాదారు ప్రదీప్ కుమార్ సిన్హా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఉత్తర ప్రదేశ్ కేడర్ 1977 బ్యాచ్​కు చెందిన రిటైర్ట్ IAS పీకే​ సిన్హా..2019 సెప్టెంబర్-11 నుంచి మోడీ ముఖ్య సలహాదారుగా సేవలందించారు.

అంతకుముందు సిన్హా.. ప్రధాని కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా(OSD)గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఓఎస్​డీగా చేసే ముందు.. నాలుగేళ్ల పాటు ఆయన కేబినెట్​ కార్యదర్శిగా, విద్యుత్​ శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. సిన్హా క్యాబినెట్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన తరువాత పిఎంఓలో ‘ప్రిన్సిపల్ అడ్వైజర్’ అనే కొత్త పోస్టును ఆయన కోసం సృష్టించి ఆయన సేవల్ని పొందుతున్న విషయం తెలిసిందే

అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. ప్రధాన సలహాదారుగా ఉన్న సిన్హా పదవీకాలం.. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఉంటుంది. లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు కొనసాగవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందైతే దాన్ని అమలు చేస్తారు. అయితే సిన్హాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా మోడీ సర్కార్ నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.