Karnataka Elections 2023: ముగిసిన కర్ణాటక ఎన్నికల ప్రచారం.. అర్థరాత్రి వేళ ప్రధాని మోదీ వీడియో సందేశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన కొన్నిగంటల తరువాత అర్థరాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోదీ కన్నడ ప్రజలను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు.

Karnataka Elections 2023: ముగిసిన కర్ణాటక ఎన్నికల ప్రచారం.. అర్థరాత్రి వేళ ప్రధాని మోదీ వీడియో సందేశం

PM Narendra Modi

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) వంటి ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతల పర్యటనలతో కన్నడనాట ప్రచారం మారుమోగిపోయింది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లుగా ప్రచారపర్వం కొనసాగింది. బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో జరిగిన చివరి 26 కిలో మీటర్ల ర్యాలీతో సహా 19 ర్యాలీలు, ఆరు రోడ్ షోలలో పాల్గొన్నారు.  ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి సోమవారం సాయంత్రం వరకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ నుంచి రాష్ట్ర స్థాయినేతలు కలుపుకొని 3116 ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించారు.

Karnataka elections 2023: మైకులు మూగబోయాయి.. ప్రచార రథాలు నిలిచాయి.. ఏపీ సరిహద్దుల్లో 57, తెలంగాణలో 24 చెక్‌పోస్టులు

కర్ణాటక ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. మే10న పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రచారపర్వానికి తెరపడిన కొద్ది గంటలకే అర్థరాత్రివేళ ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ అధికారిక ట్విటర్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు.

Karnataka elections 2023: కర్ణాటక ప్రజలకు మమతా బెనర్జీ సందేశం

ఈ వీడియో నిడివి 8 నిమిషాల 25 సెకన్లు ఉంది. బీజేపీ విజయంతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కర్ణాటకను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ప్రధాని చెప్పారు. మీ కలలు, నా కలలు కలిసి మేం నెరవేరుస్తాం అని, బీజేపీ ప్రభుత్వం పూర్తి నిజాయితీతో పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.