Dog Arrest: కుక్కను అరెస్ట్ చేసిన పోలీసులు

దేశ వ్యాప్తంగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు. మనుషులను తరలిస్తే సమస్య లేదు.. కానీ కుక్కను కూడా స్టేషన్ లో పెట్టారు.

Dog Arrest: కుక్కను అరెస్ట్ చేసిన పోలీసులు

Dog Arrest

Dog Arrest:  దేశ వ్యాప్తంగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు. మనుషులను తరలిస్తే సమస్య లేదు.. కానీ కుక్కను కూడా స్టేషన్ లో పెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. ఇండోర్‌లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త తన కుక్కను తీసుకోని రోడ్డుపైకి వచ్చారు.

కర్ఫ్యూ సమయంలో బయటకు రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడితోపాటు ఉన్న కుక్కను కూడా స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత జైలుకు పంపారు. కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ అరెస్టు వార్త సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో కేసుల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం 12,319 కరోనా కేసులు నమోదయ్యాయి.

కేసుల తీవ్ర అధికంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ కరోనా మరణాలు చాలావరకు తగ్గాయి. ఆక్సిజన్ కొరత రాకుండా చూసుకుంటున్నారు అధికారులు.