స్కార్ఫ్ వేసుకుందని రాష్ట్రపతి దగ్గరకు నో ఎంట్రీ: గోల్డ్ మెడల్‌ను తిప్పికొట్టింది

స్కార్ఫ్ వేసుకుందని రాష్ట్రపతి దగ్గరకు నో ఎంట్రీ: గోల్డ్ మెడల్‌ను తిప్పికొట్టింది

రబీహ అబ్దుర్రహీమ్ పుదుచ్చేరి యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ చదువుతోంది. కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ కు ఎంపికైంది. సోమవారం 27వ కాన్వొకేషన్‌లో వాటిని అందజేయాలనుకుంది యూనివర్సిటీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరయ్యారు. గోల్డ్ మెడల్ తీసుకోవాల్సిన రబీహను పోలీసులు మాట్లాడాలని బయటకు పిలిపించారు. రాష్ట్రపతి అక్కడి నుంచి వెళ్లిపోయేంతవరకూ ఆమెను లోనికి అనుమతించలేదు. 

కారణం అడిగితే నేరుగా చెప్పకుండా తాను ధరించిన స్కార్ఫ్ కారణం అయి ఉండొచ్చని తెలిపారు. రబీహ తన మాస్క్‌ను కేవలం ముఖం మాత్రమే కనిపించేలా కప్పుకుంది. ప్రెసిడెంట్ వెళ్లిపోయిన తర్వాత మిగిలిన ప్రముఖులు సర్టిఫికేట్లు అందజేస్తుండటంతో లోనికి పంపారు. తనకు రావాల్సిన గోల్డ్ మెడల్‌ను సున్నితంగా తిరస్కరించి కేవలం సర్టిఫికేట్ మాత్రమే అందుకుంది. 

 

‘నాకు తెలీదు వారు నన్ను వేదిక నుంచి బయటకు దేనికి రావాలనిపిలిచారో.. లోపల ఉన్న విద్యార్థులకు స్కార్ఫ్ ధరించడమే ఓ కారణం అయి ఉండొచ్చని పోలీసులు తెలిపారట. కానీ, ఎవరూ ఇదే కారణమని చెప్పలేదు. ప్రెసిడెంట్ కాన్వొకేషన్‌కు వచ్చారు. నేను వారికి ఏదో ప్రమాదం చేయడానికి వచ్చిన అనుమానితురాలిగా వాళ్లు అనుకున్నారు. నన్ను బయటకు పంపినందుకే గోల్డ్ మెడల్ వద్దనుకున్నాను. ప్రస్తుతం భారత్‌లోని విద్యార్థులు ఫైట్ చేస్తుంది ఇందుకే. దేశ పరిస్థితులు ఇలా ఉన్నందుకే’

 

‘చదువుకున్న వాళ్లమైన ఓ దృఢమైన స్టాండ్ తీసుకోవాలి. నా మెసేజ్ స్పష్టంగా, ప్రశాంతంగా ఉందని అనుకుంటున్నాను’ అని రబీహ తెలిపింది. దీనిపై విజిలెన్స్ అండ్ సెక్యూరిటీకి స్పెషల్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ హుమాయున్… పోలీసులకు, రబీహకు మధ్య జరిగిందంతా తనకు తెలియదని ఆ యువతిని స్కార్ఫ్ తీయమని ఎవరూ చెప్పలేదని ఆమె చెప్పిందని అన్నాడు. రాష్ట్రపతి రాకముందే పోలీసులు అక్కడి భద్రతా విషయాలన్నీ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు’ అని వెల్లడించాడు.