ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను ఆవిష్కరించిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 26, 2019 / 04:16 PM IST
ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను ఆవిష్కరించిన మోడీ

ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన గీత ఆరాధన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద,బరువైన భగవద్గీత బుక్ ను ఇస్కాన్ టెంపుల్ లో నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 2.8 మీటర్లతో, 670 పేజీలతో, 800 కిలోల బరువున్న ఈ భగవద్గీతను ఢిల్లీలోని కైలాష్ కాలనీ మెట్రో స్టేషన్ కి దగ్గర్లోని ఇస్కాన్ టెంపుల్ ఏర్పాటు చేయబడింది. ఇటలీలోని మిలాన్ లో ఈ భగవద్గీత బుక్ ప్రింట్ చేయబడింది. సింథటిక్ పేపర్ తో తయారు చేయబడిన ఈ భగవద్గీత చింపడానికి వీల్లేకుండా ఉంటుంది. అంతేకాకుండా వాటర్ ఫ్రూఫ్ కలిగి ఉంటుంది. ఇంతటి అతిపెద్ద పవిత్ర గ్రంధం ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా ప్రింట్ చేయలేదని ఇస్కాన్ తెలిపింది.

మంగళవారం(ఫిబ్రవరి-26,2019) పాక్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులను ప్రస్తావిస్తూ.. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని ఈ సందర్భంగా మోడీ తెలిపారు.దుష్టుల నుంచి మంచిని కాపాడడానికి భగవంతుడి శక్తి మనకు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. దుష్టశక్తులు,రాక్షసులకు ఈ విషయాన్ని తెలియజేయాలనేదే తమ ప్రయత్నమని తెలిపారు.

అంతకుముందు ఇస్కాన్ ఆలయానికి చేరుకునేందుకు ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్ నుంచి మెట్రో రైలులో మోడీ ప్రయాణించారు. ప్రయాణసమయంలో పలువురితో మోడీ మాట్లాడారు. చిన్న పిల్లలను ముద్దు చేశారు. మోడీతో కలిసి సెల్ఫీలు చాలా మంది ఆశక్తి చూపించారు.