Karnataka Congress : కర్ణాటకలో మంత్రి పదవుల పంచాయతీ .. ఎమ్మెల్యే రుద్రప్పకు మంత్రి పదవి కోసం డిమండ్

మంత్రి పదవుల పందారాల్లో గ్రూపు రాజకీయాలు శాంతింపజేసి మంత్రాంగం చేసిన పదవులను కట్టబెట్టటం కాంగ్రెస్ లో ఆనవాయితీగా జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అఖండ విజయం సాధించినా మంత్రి పదవుల కోసం లాబీయింగులు, డిమాండ్లు కొనసాగుతున్నాయి.

Karnataka Congress : కర్ణాటకలో మంత్రి పదవుల పంచాయతీ .. ఎమ్మెల్యే రుద్రప్పకు మంత్రి పదవి కోసం డిమండ్

Karnataka Congress Politics

Karnataka Congress Govt : కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించినా ఆ పార్టీ మార్క్ రాజకీయం మాత్రం కొనసాగుతోంది. మంత్రి పదవుల పందారాల్లో గ్రూపు రాజకీయాలు శాంతింపజేసి మంత్రాంగం చేసిన పదవులను కట్టబెట్టటం కాంగ్రెస్ లో ఆనవాయితీగా జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అఖండ విజయం సాధించామని ఆ ఆనందాన్ని మనసారా ఆస్వాదించకుండానే సీఎం పదవి గురించి సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను సమన్వయం చేసిన ఎట్టకేలకు పీఠాన్ని సిద్ధరామయ్యకే కట్టబెడ్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీని కోసం డీకే డిమాండ్స్ ను అంగీకరించాల్సి వచ్చింది. ఈ గండం గడిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రమాణస్వీకారాలు కూడా జరిగిపోయాయి.

అయినా మంత్రి పదవులు ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు కొనసాగుతున్నాయి కర్ణాటక కాంగ్రెస్ లో. దీంట్లో భాగంగానే హవేరీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రుద్రప్పకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన వర్గీయులు. కర్ణాటక పీసీసీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే రుద్రప్ప లామాని మద్ధతుదారుల ఆందోళన చేపట్టారు. బంజారా సామాజికవర్గానికి చెందిన రుద్రప్ప పేరు జాబితాలో రాత్రి వరకు ఉందని, చివరి నిమిషంలో పేరును తొలగించారని ఆయన వర్గీయులు ఆందోళన చేపట్టారు. బంజారా వర్గం నుంచి 75% మద్ధతు కాంగ్రెస్ పార్టీకి లభించిందని, కచ్చితంగా తమ వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలని పట్టబడుతున్న రుద్దప్ప వర్గీయులు.

Karnataka: వేర్వేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్

కాంగ్రెస్ లో మామూలే..
పదవుల్ని ఆశించే నేతలను సముదాయించి, గ్రూపుల్ని సంతృప్తి పరిచి మంత్రాంగం చేయటం కాంగ్రెస్ లో ఆనవాయితీగా కొనసాగుతోంది. విజయం సాధించటం ఓ ఎత్తు అయితే గ్రూపుల్ని సముదాయించటం మరో ఎత్తుగా ఉంటుంది కాంగ్రెస్ అధిష్టానినకి. ఇప్పుడు కన్నడ నాట కూడా అదే తతంగం కొనసాగుతోంది మంత్రి పదవుల పందారాల్లో. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 20వ తేదీన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. అదే రోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు కనీసం మరో 25 మంది మంత్రులు కావాల్సి ఉంది. దీంతో మే 19న కేబినెట్ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనా.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విబేధాల కారణంగా ఏకాభిప్రాయం కుదరటంలేదు. ఎవరికి వారే వారి అనుయాయులకు మంత్రి పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారు.

దీంతో మంత్రి పదవుల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఢిల్లీలోని పార్టీ పెద్దలతో జరిగిన సమావేశంలో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే విషయంపై హైకమాండ్ తో చర్చించి తుది జాబితా రెడీ చేసినట్లు సమాచారం. దీంట్లో భాగంగా 24 మంది మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శాఖలు కేటాయించలేదు. మంత్రిగా ప్రమాణం చేశాక శాఖల డిమాండ్స్ కూడా వస్తాయేమోమరి అన్నట్లుగానే ఉంది. ఈక్రమంలో మరోసారి మంత్రి వర్గ విస్తరణలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి.