అబ్బాయిలతో ఫోన్‌ ఎక్కువగా మాట్లాడొద్దని మందలించిన తల్లి.. ఆత్మహత్య చేసుకున్న యువతి

కర్నాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకుంది.

అబ్బాయిలతో ఫోన్‌ ఎక్కువగా మాట్లాడొద్దని మందలించిన తల్లి.. ఆత్మహత్య చేసుకున్న యువతి

Puc Student Suicide

Puc Student Suicide : కర్నాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ యవతి పేరు స్నేహ. వయసు 18ఏళ్లు. దొడ్డబళ్లాపుర పట్టణంలోని ప్రైవేటు కాలేజీలో పీయూసీ సెకండియర్ చదువుతోంది. కాగా, స్నేహ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడేది. అది కూడా అబ్బాయిలతో గంటల తరబడి మాట్లాడేది. ఇది గమనించిన తల్లి.. కూతురిని తప్పుపట్టింది.

ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడొద్దని పలుమార్లు చెప్పింది. అయినా స్నేహ తీరు మారలేదు. ఏమాత్రం తగ్గించలేదు. ఫోన్ లో అబ్బాయిలతో మాట్లాడుతూనే ఉంది. దీంతో ఈసారి కొంచెం గట్టిగానే తల్లి మందలించింది. అంతే, స్నేహ తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలో వారం క్రితం ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్ర అనారోగ్యానికి గురైన స్నేహను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించారు. అయినా ఫలింతం లేకపోయింది. శనివారం(మార్చి 20,2021) ఉదయం స్నేహ చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో పిల్లలు మరీ సున్నితంగా, పెంకిగా తయారయ్యారు. చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయనో, టీచర్ మందలించిందనో, అమ్మ తిట్టిందనో, నాన్న అరిచడానో.. ఇలా చిన్నచిన్న విషయాలకే అలుగుతున్నారు. మనస్తాపంతో సూసైడ్ చేసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇది మంచిది కాదు. పెద్దలు ఏం చెప్పినా అది మన మంచి కోసమే అని పిల్లలు గ్రహించాలి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలి. పిల్లలు బాగా అడిక్ట్ అయ్యేవరకు ఊరుకుండి, ఆ తర్వాత తిట్టడం చెయ్యడం కరెక్ట్ కాదు. ముందు నుంచి వారిపై శ్రద్దపెట్టాలి. ఆదిలోనే చర్యలు తీసుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు.