Punjab Results : పంజాబ్ పల్స్ ఏంటి..? కేజ్రీవాల్ ‘చీపురు’తో ఊడ్చేయనున్నారా..?

2017 నుంచి పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ఎన్నికల సమయంలో ప్రధానంగా మహిళలు- యువతను ఆకట్టుకొనే విధంగా పార్టీల నేతలు వ్యవహరించారు.

Punjab Results : పంజాబ్ పల్స్ ఏంటి..? కేజ్రీవాల్ ‘చీపురు’తో ఊడ్చేయనున్నారా..?

Punjab Results

Punjab Results :  పంజాబ్‌లో పొలిటికల్ జాక్ పాట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి పార్టీలు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో హస్తానికి మరో అవకాశం ఇస్తారా? లేక కేజ్రీవాల్ క్రేజ్‌కే పట్టం కట్టబోతున్నారా? మరికాసేపట్లో తేలనుంది.

ఇక ఎగ్జిట్ పోల్స్‌ అంచనా ప్రకారం.. పంజాబ్‌లో ఆప్ పాగా వేస్తుందని తేలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతుండగా.. దాన్ని అరవింద్ కేజ్రీవాల్‌ కూల్చేందుకు సిద్ధమైనట్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైంది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో యూపీ తర్వాత కీలకమైన రాష్ట్రం పంజాబ్. మొదటి నుంచీ స్పష్టమైన హామీలిస్తూ ప్రజల్లోకి వెళ్లిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ప్రజల నాడీ పట్టేసింది. ఏకపక్షంగా ఆప్ విజయాన్ని స్పష్టం చేశాయి ఎగ్జిట్ పోల్స్.

అటు కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోవటానికి అనేక సమీకరణాలు తెరమీదకు తెచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. సీఎంను మార్పు చేసింది. ఎస్సీ వర్గానికి సీఎం పీఠం కట్టబెట్టింది. అసమ్మతి నేతగా మారిన సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. రాహుల్.. ప్రియాంక ప్రచారం నిర్వహించినా.. కేజ్రీవాల్ మ్యాజిక్ మాత్రమే వర్కవుట్ అయింది. ఇతర పార్టీలను ఊడ్చేసింది. దీంతో కాంగ్రెస్‌లో టెన్షన్‌ మొదలైంది.

Read This : UP Results : మోదీ-యోగీ మ్యాజిక్ రిపీట్..? యూపీలో బీజేపీ గెలిస్తే మరో చరిత్రే!

2017 ఎన్నికల్లో కాంగ్రెస్ – ఆప్ సాధించిన ఫలితాలు 2022లో రివర్స్ కాబోతున్నట్లుగా సర్వే అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 77 సీట్లు దక్కి అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆప్ ఆ ఎన్నికల్లో 20 సీట్లు దక్కించుకుంది. కాగా, శిరోమణి అకాలీ దల్ – 15, బీజేపీ -3 స్థానాల్లో విజయం సాధించాయి. ఇప్పుడు 2022 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో శిరోమణీ అకాళీ దల్ గతం కంటే తగ్గినట్టుగా కనిపిస్తోంది. సర్వేల్లో శిరోమణి అకాలీదళ్ మూడో స్థానానికి పరిమితం అయినట్లు తేల్చాయి. ఇక, బీజేపీ గతంలో వలే అదే స్థానాలు దక్కించుకోనుంది.

– గత ఎన్నికల్లో ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేసిన ఇండియా టూడే సైతం ఈ ఎన్నికల్లో ఆప్ కు 76 -90 సీట్లు వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ కు 19- 31 వరకు స్థానాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీకి 1నుంచి 4, శిరోమణి అకాలీదళ్‌కు 7 నుంచి 11 వరకు వస్తాయి.

– ఏబీపీ సీ ఓటర్‌ ప్రకారం ఆప్‌కు 51 నుంచి 61, కాంగ్రెస్‌కు 22 నుంచి 28, బీజేపీకి 7నుంచి 13, ఇతరులకు 20 నుంచి 25 స్థానాలు దక్కుతాయి.

– జన్‌కీ బాత్‌ ఆప్‌కు 60 నుంచి 84 సీట్లు రావొచ్చని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 18 నుంచి 31స బీజేపీకి 3 నుంచి 7, అకాలీదళ్‌కు 12 నుంచి 19 సీట్లు వస్తాయి.

– టుడేస్‌ చాణక్య ప్రకారం ఆప్‌ ఏకంగా సెంచరీ కొడుతుంది. కాంగ్రెస్‌కు 10, శిరోమణి అకాలీదళ్‌కు 6, బీజేపీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వస్తుంది.

– ఇక టైమ్స్‌నౌ ప్రకారం ఆప్‌కు 70, కాంగ్రెస్‌కు 22, బీజేపీకి 5, అకాలీదళ్‌కు 19 సీట్లు వస్తాయి.

Read This : 5 States Election Results: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. కీలకాంశాలు

2017 నుంచి పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ఎన్నికల సమయంలో ప్రధానంగా మహిళలు- యువతను ఆకట్టుకొనే విధంగా పార్టీల నేతలు వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్‌ మాన్‌పైపు పంజాబ్‌ ప్రజలు మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ ఛన్నీ రెండో స్థానానికి పడిపోయారు. భగవంత్‌ మాన్‌.. ముఖ్యమంత్రి కావాలని 39 శాతం మంది, ఛన్నీ సీఎం కావాలని 30 శాతం మంది కోరుకున్నారు. సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌వైపు 20 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వే సంస్థలు తేల్చాయి.