Punjab Election : ఉచిత విదేశీ విద్య,ఉచిత వైద్యం..ఎస్పీల సంక్షేమానికి కేజ్రీవాల్ వరాలు!

వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ

Punjab Election : ఉచిత విదేశీ విద్య,ఉచిత వైద్యం..ఎస్పీల సంక్షేమానికి కేజ్రీవాల్ వరాలు!

Kejriwal

Punjab Election :  వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి పార్టీ కేడర్ లో ఉత్తేజం నింపడమే కాకుండా పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేలా పలు హామీలను గుప్పిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు వ‌రాలు కురిపించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ తాజాగా ద‌ళితులు, అణ‌గారిన‌వ‌ర్గాల కోసం మ‌రిన్ని హామీలు గుప్పించారు.

మంగళవారం పంజాబ్ లోని హోషియార్ పూర్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ…”షెడ్యూల్డు కులాలవారికి ఐదు వాగ్దానాలు చేస్తున్నా. ఆప్ అధికారంలోకి వ‌స్తే ఎస్సీ విద్యార్ధుల‌కు బాలలకు ఉచిత విద్య, ఐఏఎస్‌, మెడిక‌ల్‌, ఐఐటీ కోర్సుల్లో ప్రవేశానికి ఉచిత కోచింగ్‌, కళాశాల విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య‌, ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకువ‌స్తాం. 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తాం”అని అన్నారు.

ఇక,పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చ‌న్ని కులం కార్డును వాడుతున్నార‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన చ‌న్ని త‌న కులం కార్డు వాడుతూ ఆ వ‌ర్గీయుల ఓట్ల‌ను అభ్య‌ర్ధిస్తున్నార‌ని అన్నారు. తాను ఎస్సీ కులాలకు చెందినవాడిని కాకపోయినా ఎస్సీలకు సహాయపడటానికి ఓ కుటుంబ స‌భ్యుడిగా ముందుకొచ్చా అని కేజ్రీవాల్ అన్నారు.

ALSO READ Farmers Protest : ప్రభుత్వ ప్రతిపాదనపై ఎటూ తేలకుండానే ముగిసిన రైతు సంఘాల భేటీ