Uttarakhand: ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామి..!

ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ సహా శనివారం డెహ్రాడూన్ లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై నూతన సీఎం ఎంపికపై చర్చలు జరిపారు.

Uttarakhand: ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామి..!

Uttarakhand

Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ సహా శనివారం డెహ్రాడూన్ లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై నూతన సీఎం ఎంపికపై చర్చలు జరిపారు. అనంతరం ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలందరూ పుష్కర్ సింగ్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

పుష్కర్ సింగ్ ఖతిమా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామాతో ఎమ్మెల్యేలు నూతన సీఎంను ఎన్నుకున్నారు. నాలుగు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న తీరథ్ సింగ్ రావత్ నిన్న గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు రాజీనామా అందజేయగా నేడు కొత్త సీఎంను ఎన్నుకున్నారు. దీంతో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నాలుగు నెలల్లో మూడవ ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు.

అయితే సీఎం తీరథ్ సింగ్ రాజీనామా చేయగానే కొందరి పేర్లు ముఖ్యమంత్రి రేసులో ముందుకు వచ్చాయి. సత్‌పాల్ సింగ్, ధన్‌సింగ్ రావత్ పేర్లు ప్రముఖంగా సీఎం రేసులో వినిపించాయి. అయితే వీరిద్దర్నీ కాదని, అధిష్ఠానం పుష్కర్ సింగ్ ధామీని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ యూత్ స్టేట్ వింగ్ నుంచి సేవలందిస్తు వచ్చిన పుష్కర్ సింగ్ ధామి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా నేడు సీఎం పదవిని కూడా అందుకున్నారు.

రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసిన ఉన్న రావత్ ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేని పరిస్థితి ఉండడంతో పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని తీరథ్ సింగ్ రావత్ కు అధిష్టానం సూచించినట్లు తెలుస్తుంది. నిజానికి సెప్టెంబర్ 5 తో ఆరునెలల గడువు పూర్తికానుండగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీగానే ఉన్నా కరోనా పరిస్థితులతో ఉప ఎన్నిక జరపలేమని ఎస్ఈసీ తెలపడంతో రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తుంది.