కేజ్రీవాల్ కేబినెట్‌లోకి రైజింగ్ స్టార్ : ఆర్థిక మంత్రిగా రాఘవ్ చాధా..!?

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 07:02 AM IST
కేజ్రీవాల్ కేబినెట్‌లోకి రైజింగ్ స్టార్ : ఆర్థిక మంత్రిగా రాఘవ్ చాధా..!?

జాతీయ పార్టీలను కూడా ఊడ్చి పారేసి ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని ఘన విజయంతో దక్కించుకుంది ఆమ్ఆద్మీ పార్టీ. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కేబినెట్ లోకి ఈ సారి యువకెరటాలు రానున్నట్లుగా సమాచారం. 

ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువనాయకుడు రాఘవ్ చాధాకు ఆర్థిక శాఖ పగ్గాలు అప్పజెప్పనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 31 ఏళ్ల నవ యువకుడు  రాఘవ్  చాధా రాజీందర్ నగర్ నియోజకవర్గం నుంచి 20వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన ఈ యువనేత…ఆప్ అధికార ప్రతినిధి బాధ్యతల్ని కూడా అత్యంత చాకచక్యంగా నెరవేరుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. వారి విమర్శలకు ధీటుగా జవాబిచ్చారు. అంతేకాదు ఆప్ సర్కార్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై తనదైన శైలిలో ప్రచారం చేసిన రాఘవ్ చాదా ఎన్నికల్లో పార్టీ విజయానికి విశేషంగా కృషి చేశారు. కీలక పాత్ర పోషించారు.

కాగా త్వరలో సీఎంగా బాధ్యతలు చేపట్టినున్న కేజ్రీవాల్ కేబినెట్‌లో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నట్టుగా సమాచారం. ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువనాయకుడు రాఘవ్ చద్దాకు ఆర్థిక శాఖ అప్పగించున్నట్లుగా ప్రచారం జరగుతోంది. దీనిపై పలు వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. 
 
31 ఏళ్ల రాఘవ్.. రాజీందర్ నగర్ నియోజకవర్గం నుంచి 20వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన ఈ యువనేత… ఆప్ అధికార ప్రతినిధి కూడా. ప్రచారంలో తన వాగ్దాటితో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. ఆప్ సర్కార్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై తనదైన శైలిలో ప్రచారం చేసి.. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు.
చార్టెడ్ ఎకౌంట్ అయిన రాఘవ్ చాధా చార్టెడ్ అకౌంటెంట్ అయిన రాఘవ్ చాదా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తనకు ఇచ్చిన బాధ్యతల్ని అత్యంత జాగ్రత్తగా నెరవేరుస్తూ పార్టీ విజయానికి తనదైన కృషి చేసిన రాఘవ్ కు కేజ్రీవాల్ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. 

పైగారాఘవ్ గత కేబినెట్‌లో కొన్ని రోజులు ఆర్థికశాఖ సలహాదారుగా కూడా పని చేశారు. ఆయనపై నమ్మకం ఏర్పడిన కేజ్రీవాల్ 2020 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని రాఘవ్ నిలబెట్టుకున్నారు. విజయాన్ని సాధించారు. దీంతో కేబినెట్ లో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను రాఘవ్ కొట్టిపడేశారు. అవన్నీ ప్రచారం మాత్రమేననీ..ప్రస్తుతం తాము కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నామని.. ఇది ఆప్ సైనికుల విజయమని మరోసారి తనదైన శైలిలో సమాధానమిచ్చారు ఈ యువనేత రాఘవ్ చాదా. మరి ఈ వార్తలు నిజమవుతాయో లేదో వేచి చూడాలి.