లాక్ డౌన్ కు ప్రజలు ఎదురు తిరుగుతారు, కేంద్రానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ హెచ్చరిక

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు లాక్ డౌన్ విధించాయి. మన భారత దేశంలోనూ లాక్ డౌన్ విధించారు. చాలా స్ట్రిక్ట్ గా

  • Published By: veegamteam ,Published On : April 6, 2020 / 03:01 AM IST
లాక్ డౌన్ కు ప్రజలు ఎదురు తిరుగుతారు, కేంద్రానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ హెచ్చరిక

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు లాక్ డౌన్ విధించాయి. మన భారత దేశంలోనూ లాక్ డౌన్ విధించారు. చాలా స్ట్రిక్ట్ గా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు లాక్ డౌన్ విధించాయి. మన భారత దేశంలోనూ లాక్ డౌన్ విధించారు. చాలా స్ట్రిక్ట్ గా దీన్ని అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ కి వ్యాక్సిన్ లేని కారణంగా ప్రస్తుతం ప్రభుత్వాల దగ్గరున్న ఏకైక మార్గం లాక్ డౌన్ ఒక్కటే. దీని ద్వారా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. మన దేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. కాగా, ఆ తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగిస్తారా? లేక ఎత్తివేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒక వేళ కొనసాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక వేళ ఎత్తివేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది హాట్ టాపిక్ గా మారింది.

లాక్ డౌన్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు:
కాగా లాక్ డౌన్ పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే ఉపాధి, ఆదాయం కోల్పోయిన ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో వారికి ఆదాయం అందించకుండా లాక్ డౌన్ కొనసాగించడం కరెక్ట్ కాదన్నారాయన. అదే కనుక జరిగితే ప్రజలు ఊరుకోరని, లాక్ డౌన్ నిబంధనలను తిరస్కరిస్తారని, ఎదురు తిరిగే ప్రమాదం ఉందని రాజన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా జాగ్రత్త పడాలని సూచించారు.(ఎండలు ఉంటే కరోనా రాదా ?)

లాక్ డాన్ తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలంటే:
అంతేకాదు లాక్ డాన్ తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలనే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజన్ సూచించారు. స్వాతంత్ర్యం తర్వాత భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇదే అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి భారత్ ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆయన తాజాగా తన బ్లాగ్‌లో చర్చించారు. కరోనా మహమ్మారి పూర్తిగా కట్టడికాని పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేయాల్సి వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆయన సూచించారు. 

లాక్ డౌన్ తీసేయాల్సిన పరిస్థితి వస్తే అందుకు మనం సిద్ధపడాలి:
‘మహమ్మారి పూర్తిగా కంట్రోల్‌లోని రాని పరిస్థితిల్లో లాక్ డౌన్ తీసేయాల్సిన పరిస్థితి వస్తే అందుకు మనం సిద్ధపడాలి. ఎక్కువ కాలం  ప్రజలను లాక్ డౌన్‌లో ఉంచలేం. జీవికకు ప్రమాదంలో పడితే వారు తిరగబడే ప్రమాదం ఉంది. అందుకే ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించడానికి  తీసుకోవాల్సి చర్యలపై ముందుగానే ఆలోచించాలి’ అని అన్నారు. వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు ఎలా  తీసుకెళ్లాలనే దానిపై పారిశ్రామిక వర్గాలతో కలసి చర్యలు తీసుకోవాలన్నారు.  

సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి:
2008-09లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు డిమాండ్ పడిపోయినా మన కార్మికులు పనులకు వెళ్లగలిగారు. మన సంస్థలు క్రమేపీ బలపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ చాలావరకు ఆరోగ్యకరంగా మారింది. ఇవన్నీ కరోనా తీవ్రతతో మారిపోయాయి. అయితే సరైన నిర్ణయాలు, చక్కని ప్రాధమ్యాలతో మనకున్న వనరులతో వైరస్ ప్రభావాన్ని చిత్తు చేయగలం. మరింత ఆశాజనకమైన భవిష్యత్తుకు యవనికను సిద్ధం చేయగలమని రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ లాక్ డౌన్ తర్వాతా వైరస్ తగ్గకపోతే తగిన జాగ్రత్తలతో కొన్ని ప్రాంతాల్లోనైనా కార్యకలాపాల పునరుద్ధరణపై ఏమేం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణ అవసరాలను సమీక్షించుకోవడంతో పాటు అంతగా ప్రాముఖ్యం కాని ఖర్చులను కుదించుకోవాలని రాజన్ సూచించారు.

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నిపుణుల సాయం తీసుకోండి:
కరోనా వైరస్ ప్రభావంతో మునుపెన్నడూ లేనంతగా ఆర్థిక రంగం ప్రభావితమైనందువల్ల దీని నుంచి బయటపడే మార్గాలను తెలుసుకునేందుకు నిపుణులను ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు రాజన్. స్వాతంత్ర్యం తర్వాత ఎన్నడూ లేని పరిస్థితిని దేశం ఎదుర్కొంటున్న దృష్ట్యా విపక్షాల నుంచే కాకుండా అన్ని రంగాల నుంచి నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచే ప్రతీదీ నడపాలనుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. చేయాల్సింది చాలా ఉందన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు దేశంలో అనేకమంది ఉన్నారు. వారే కాకుండా గతంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయాల్లో సేవలందించిన అనుభజ్ఞులు విపక్షాల్లోనూ ఉన్నారు. అలాంటి వారందరినీ ప్రభుత్వం ఆహ్వానించాలని రాజన్ తన బ్లాగ్ లో తెలిపారు.