బీజేపీ ఓటమే లక్ష్యం: యూపీలో కాంగ్రెస్ వ్యూహం ఇదే

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2019 / 02:20 PM IST
బీజేపీ ఓటమే లక్ష్యం: యూపీలో కాంగ్రెస్ వ్యూహం ఇదే

ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వాదీ లేదా కాంగ్రెస్ కావచ్చన్నారు.ఉత్తరప్రదేశ్ లో కొన్ని స్థానాల్లో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని, తమ పార్టీ బలంగా లేని స్థానాల్లో బీజేపీ ఓట్లు చీల్చి ఆ పార్టీకి నష్టం కలిగించి,బీఎస్పీకి లాభం చేకూర్చే ఉద్దేశ్యంతో అభ్యర్థులను నిలబెట్టినట్లు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్ సమర్థించాడు.

గురువారం ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండి గెలవదనుకున్న స్థానాల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి విజయానికి సహాయపడదామని తాను ప్రియాంక,జ్యోతిరాధిత్య సింధియాలకు చెప్పానని రాహుల్ తెలిపారు.యూపీలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను ప్రియాంక,సింధియాలు చూస్తున్న విషయం తెలిసిందే. తమ ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడమేని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు.ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ ఎందుకు లేదన్న ప్రశ్నకు సమాధానంగా…బీఎస్పీ-ఎస్పీ వ్యూహ్మాత్మక కారణాలతోనే కాంగ్రెస్ ను పక్కనబెట్టి పోటీ చేస్తున్నారని తెలిపారు. అఖిలేష్,మాయావతిని తాను అత్యంత గౌరవిస్తానని రాహుల్ అన్నారు. యూపీలో తన సొంత స్పేస్ ను తాను తప్పక నిర్మించుకోవాల్సి ఉందని,కానీ తాము వారికి సాయం చేయగల స్థానాల్లో సాయం చేస్తున్నామని తెలిపారు.

అంతకుముందు బలహీన అభ్యర్థులను కొన్ని స్థానాల్లో నిలబెట్టామంటూ ప్రియాంక చేసిన కామెంట్స్ పై అఖిలేష్,మాయావతిలు ఘాటుగా స్పందించారు.కాంగ్రెస్ ఎక్కడా కూడా బలహీన అభ్యర్థులను  నిలబెట్టిందని తాను భావించడంలేదని అఖిలేష్ అన్నారు.ఏ పార్టీ కూడా ఇలా చేయదన్నారు.ప్రజలు వాళ్లతో లేరని గుర్తించిన కాంగ్రెస్ ఇప్పుడు సాకులు చెబుతోందన్నారు. బీజేపీ కాంగ్రెస్ దొందూ దొందేనని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. మాయా,అఖిలేష్ కామెంట్స్ ప్రియాంక స్పందిస్తూ…తమ సొంత బలం మీదేనే పోటీ చేస్తున్నానని మాత్రేమే తాను చెప్పానని అన్నారు.ఏ విధంగానైనా బీజేపీకి లబ్ది చేకూర్చడం కంటే తాను చావడానికి సిద్దమని ఆమె అన్నారు.బలంగా పోరాడగలిగే,బీజేపీ ఓట్లు చీల్చగలిగే అభ్యర్థులను యూపీలో తాము సెలక్ట్ చేసుకున్నామని ప్రియాంక సృష్టం చేశారు.