Lakhimpur Kheri Violence : లఖిమ్‌పూర్‌కు రాహుల్ గాంధీ..బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్‌పూర్‌ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

Lakhimpur Kheri Violence : లఖిమ్‌పూర్‌కు రాహుల్ గాంధీ..బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ!

Rahul (4)

Lakhimpur Kheri Violence దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్‌పూర్‌ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం లఖిమ్‌పూర్‌ వెళ్లనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు,లఖిమ్‌పూర్‌ లో విపక్ష నేతలకు ప్రవేశించకుండా యూపీ ప్రభుత్వ అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. సోమవారం లఖిమ్‌పూర్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రియాంక గాంధీని గృహ నిర్భంధం చేయగా, మంగళవారం ఛత్తీస్‌గఢ్ సీఎం బూపేష్ భాఘే‌ల్‌ను లక్నో ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విషయమై అరెస్ట్‌లు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి.

ఇక,ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై మంగళవారం ప్రియాంక గాంధీ ఓ ప్రకటన విడుదల చేశారు. సీతాపూర్‌లోని ఒక పోలీసు కాంపౌండ్‌లో తనను చట్టవిరుద్ధంగా ఉంచారని.. తన అరెస్టుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియదని.. ఏ సెక్షన్​ కింద అరెస్ట్​ చేశారో కూడా చెప్పలేదని పేర్కొన్నారు. 38 గంటలుగా సీతాపూర్‌ పీఏసీ కాంపౌండ్‌లోనే తనను ఉంచారని తెలిపారు. తనకు ఎలాంటి నోటీసు లేదా ఎఫ్ఐఆర్ కాపీ అందించలేదని.. రెండురోజులుగా ఏ మేజిస్ట్రేట్‌ ముందు కూడా హాజరుపరచలేదని.. తన లాయర్ ని కలిసేందుకు కూడా అనుమతించట్లేదని చెప్పుకొచ్చారు.

అరెస్ట్ చేసిన సమయంలో తాను సీతాపుర్​ జిల్లా పరిధిలో పర్యటిస్తున్నానని. ఆ ప్రాంతం ఘటనాస్థలికి 20 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. తాను పర్యటించిన ప్రాంతంలో 144 సెక్షన్​ కూడా అమలులో లేదన్నారు. అయినప్పటికీ పోలీసులు తనని ఎందుకు అరెస్ట్​ చేశారు చెప్పటం లేదని అన్నారు. అసలు ఎఫ్​ఐఆర్​ ఏం నమోదు చేశారో కూడా తెలీదు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎఫ్​ఐఆర్​లోని కొన్ని వివరాలు తెలిశాయి. అందులో పేర్కొన్న 11 మందిలో 8 మంది అరెస్ట్​ సమయంలో అసలు అక్కడ లేరన్నారు.

Lakhimpur Kheri : కొత్త జమ్మూ కశ్మీర్ గా “ఉత్తరప్రదేశ్”.. 9 మరణాలకు ముందు అసలేం జరిగిందంటే

ALSO READ Lakhimpur Kheri Violence : తాను అక్కడ లేనన్న కేంద్రమంత్రి కుమారుడు..నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి

ALSO READ Lakhimpur Kheri Violence : రైతులపై దూసుకెళ్లిన కారు వీడియో వైరల్‌..సీబీఐ దర్యాప్తు చేయించాలని సీజేఐకి లాయర్ల విజ్ణప్తి