ప్రయాణికులు లేక 168రైళ్లు రద్దు

ప్రయాణికులు లేక 168రైళ్లు రద్దు

ఇండియన్ రైల్వేస్ 168రైళ్లను రద్దు చేసింది. కరోనావైరస్ భయంతో మార్చి 20 నుంచి 31వరకూ రైళ్లు రద్దు చేస్తున్నట్లు గురువారం సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే బుధవారం 99రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులందరికీ పర్సనల్‌గా ట్రైన్ సర్వీస్ క్యాన్సిల్ అయిన వివరాలను పంపుతామని తెలిపారు. 

వెస్ట్ సెంట్రల్ రైల్వే, నార్తరన్ రైల్వేల నుంచి 11రైళ్లను, దక్షిణ మధ్య రైల్వే నుంచి 20 రైళ్లు, సదరన్ రైల్వే నుంచి 32, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 5రైళ్లు రద్దు అయ్యాయి. దాంతో పాటుగా రైల్వే ఉద్యోగుల్లో ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు లాంటివి ఉన్నా, శ్వాస తీసుకోవడానికి సమస్యలున్నా తెలియజేసి ఫుడ్ సెక్షన్‌కు దూరంగా ఉండాలని సూచించింది. 

మంగళవారం 85రైళ్లు క్లోజ్ చేశారు. రైళ్లలో సరిపడ ప్రయాణికులు లేకపోవడంతో సర్వీసులు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొద్ది రోజులుగా ట్రైన్ టిక్కెట్ క్యాన్సిలేషన్లు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కొద్ది రైళ్లకు టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటే వంద శాతం రీ ఫండ్ చేయనున్నట్లు రైల్వే బోర్డ్ అధికారులు వెల్లడించారు. అత్యవసరం కాకపోతే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటూ రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్ ప్రయాణికులకు సూచించారు. 

See Also | చైనీస్ వైర‌స్ అనొద్దు.. ట్రంప్‌కు WHO వార్నింగ్