Rajasthan : వాన వాన వెళ్లువాయే, నాలుగు రోజుల నుంచి వర్షాలు..ఫుల్ ఎంజాయ్ చేస్తున్న జనాలు

రాజస్థాన్‌ అంటే ముందుగా గుర్తోచ్చేది థార్‌ ఏడారి. ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసిన ఎండల మంటలే మంట పుట్టిస్తాయి. చమటలు, ఉక్కపోత తప్ప మరేవీ తెలియదు అక్కడి ప్రజలకు. వాన పడితే చాలు...సంతోషిస్తుంటారు. అలాంటిది...ఏకంగా నాలుగు రోజులు వాన కురిస్తే ఇంకేమైనా ఉందా?

Rajasthan : వాన వాన వెళ్లువాయే, నాలుగు రోజుల నుంచి వర్షాలు..ఫుల్ ఎంజాయ్ చేస్తున్న జనాలు

Rain

Heavy Rains In Jhalawar : వాన వాన వెళ్లువాయే అనేది ఓ తెలుగు సాంగ్. చిరంజీవి, విజయశాంతిలు వానలో తడుస్తూ..ఉన్న ఈ పాట ఫుల్ హిట్ అయ్యింది. ఇలాగే..నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతుండడంతో జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతుంటే…ఎంజాయ్ చేయడం ఏంటీ ? అని అనుకుంటున్నారా ? వాన పడగానే..వాళ్లు సంతోష పడుతున్నారు. ఎందుకంటే..వాళ్లు ఉండేది ఎడారి ప్రాంతంలో..ఒక గంట పాటు వర్షం పడాలని కోరుకుంటున్న జనాలకు ఏకంగా నాలుగు రోజుల నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఊరంతా ఆనందంతో తడిసిముద్దవుతోంది.

Read More : India Electric Supercar: ఈ ఇండియన్ కార్.. టెస్లా కాదు.. అంతకుమించి

థార్ ఎడారి : –
రాజస్థాన్‌ అంటే ముందుగా గుర్తోచ్చేది థార్‌ ఏడారి. ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసిన ఎండల మంటలే మంట పుట్టిస్తాయి. చమటలు, ఉక్కపోత తప్ప మరేవీ తెలియదు అక్కడి ప్రజలకు. వాన పడితే చాలు…సంతోషిస్తుంటారు. అలాంటిది…ఏకంగా నాలుగు రోజులు వాన కురిస్తే ఇంకేమైనా ఉందా? కేరింతలు పులకింతలవుతాయి. నాలుగు రోజులుగా వానలు దంచికొడుతుండడంతో ఝలావార్‌ మొత్తం జలమయమైంది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఊర్లో ఎక్కడ చూసిన నీరే..ఎటు చూసిన వరదే. రోడ్లన్ని నదులుగా మారిపోయాయి.

Read More :Serum CEO : పిల్లలకు Covovax వ్యాక్సిన్ అప్పటి నుంచే!

వరుణుడు కరుణించాడు : –
ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమౌతే..ప్రజలు భయపడిపోతారు. ఎక్కడ ఇళ్లలోకి నీరు వస్తుందనే భయం ఉంటుంది. వాహనాలు నీట మునిగితే చాలా నష్టమని అనుకుంటుంటారు. కానీ ఝలావార్‌లో మాత్రం సీన్‌ రివర్స్‌. చాలా కాలం తర్వాత వరుణుడు కరుణించడంతో అక్కడి ప్రజలు ఆనందంలో మునిగితేలుతున్నారు. రోడ్లపై చేరిన వర్షపు నీరులో ఈత కొడుతూ జాలీగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

Read More :Natyam : ‘నమ: శివాయ’ వీడియో సాంగ్ అద్భుతంగా ఉందంటున్నారు..

ఫుల్ ఖుష్ అవుతున్న ప్రజలు : –
అదేదో స్విమ్మింగ్‌ పూల్ అన్నట్లు ఎగిరి దూకుతున్నారు. వరదను సైతం లెక్క చేయకుండా ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. వరద ఉధృతి కారణంగా వాహనాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అటు వరద తీవ్రత మరింత పెరగడంతో నదులు పోటెత్తుతున్నాయి. న‌దులు, వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి.