“రాముడు అంటే ప్రేమ”: అయోధ్య శంకుస్థాపనపై రాహుల్ గాంధీ ట్వీట్

“రాముడు అంటే ప్రేమ”: అయోధ్య శంకుస్థాపనపై రాహుల్ గాంధీ ట్వీట్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన గురించి ట్వీట్ చేశారు. రాముడంటే ప్రేమ, దయ, న్యాయాలకు చిహ్నం అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మహోత్సవం గురించి ప్రియాంక గాంధీ ట్వీట్ చేసిన తర్వాత రాహుల్ ట్వీట్ చేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమం జాతి ఐక్యత, సమాజ శ్రేయస్సు, సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రియాంక ట్వీట్ లో పేర్కొన్నారు.

రాహుల్ చేసిన ట్వీట్ లో బీజేపీని ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది. ‘పురుషోత్తముడైన రాముడు మానవత్వానికే ఉత్తమమైన ఉదాహరణ. మన మనస్సులో పాతుకుపోయిన వాస్తవాలకు, మానవత్వానికి ఆయన ప్రతీక. రాముడంటే ప్రేమ. ఎవరినీ ద్వేషించడు. రాముడంటే దయ. ఎవరిపైనా క్రూరత్వం చూపించలేదు. ఎప్పుడూ అన్యాయం చేయలేదు’ అని రాసుకొచ్చాడు.

గురువారం జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి ఎవరినీ ఆహ్వానించలేదు. ప్రధాని నరేంద్ర మోడీ.. ఒక్కరే శంకుస్థాపన కార్యక్రమంలో 40కేజీల ఇటుకతో గుడికి చిహ్నంగా పేర్చి ఆరంభించారు. 150మంది జనం.. మోహన్ భాగవత్, బీజేపీ ఐడియాలజికల్ మెంటర్ రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్, యూపీ గవర్నర్, ఇతర వీఐపీలు కార్యక్రమానికి హాజరయ్యారు.