LPG Cylinder Price:: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. వినియోగదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

సెప్టెంబర్ 1వ తేదీన సామాన్యులకు భారంగా మారిన గ్యాస్ ధరలపై కొంత ఊరట లభించింది. దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలీండర్ ధరను తగ్గించాయి. 19కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలీండర్ పై రూ. 91.5 తగ్గించాయి. అయితే గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులేదు.

LPG Cylinder Price:: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. వినియోగదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

Gas price

LPG Cylinder Price:: గ్యాస్ సిలీండర్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సెప్టెంబర్ 1వ తేదీన సామాన్యులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ ధర తగ్గింపు గృహవినియోగ ఆధారిత గ్యాస్ సిలీండర్లపై కాదు.. కేవలం వాణిజ్య సిలీండర్లపై మాత్రమే. సెప్టెంబర్ 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలీండర్ ధరలు రూ. 91.50మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.

Gas Cylinder Price: సామాన్యుడిపై మరోభారం.. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర..

తాజాగా తగ్గిన ధరల ప్రకారం చూస్తే.. 19కేజీల ఎల్పీజీ సిలీండర్ ధర రూ. 91.50మేర తగ్గగా.. నేటి నుంచి ఇండన్ గ్యాస్ సిలీండర్ పాత ధర రూ. 1976.07 నుంచి ప్రస్తుతం 1885 లభించనుంది. ఆయా నగరాల్లో తగ్గిన గ్యాస్ ధరలను చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలీండర్ ధర రూ. 1885, కోల్ కతాలో 1844, ముంబయి, చెన్నైలో 2045 వసూళు చేయనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన కమర్షియల్ గ్యాస్ ధరలను చూస్తే.. హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ సిలీండర్ రూ. 2099.5కి చేరింది. వరంగల్ లో 2,141.50గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో రూ. 2,034, విశాఖపట్టణంలో రూ. 1,953కి చేరింది.

Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు

గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌, వాణిజ్య అవసరాల కోసం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల్లో మార్పుల ఆధారంగా ముడి చమురు ధరలు నిర్ణయించబడతాయి. ఈ ధర తగ్గింపుతో రెస్టారెట్లు, తినుబండారాలు, టీ స్టాల్స్ మొదలైన వాటికి ఉపశమనం కలగనుంది. కమర్షియల్ సిలీండర్ల వినియోగంలో 19 కిలోల సిలీండర్ అతిపెద్ద వినియోగదారుగా ఉంది.