Helicopter Accident: హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణం

జనరల్ బిపిన్ రావత్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం ప్రతికూల వాతావరణమే కారణమని త్రివిధ దళాల కమిటీ పేర్కొంది.

Helicopter Accident: హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణం

Bipin

Helicopter Accident: భారత దేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి దివంగత జనరల్ బిపిన్ రావత్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం ప్రతికూల వాతావరణమే కారణమని త్రివిధ దళాల కమిటీ పేర్కొంది. ఈమేరకు హెలీకాప్టర్ ప్రమాద ఘటనపై పూర్తి నివేదికను శుక్రవారం త్రివిధ దళాల కమిటీ రక్షణ మంత్రిత్వశాఖకు సమర్పించారు. డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదానికి గురైన ఎంఐ-17వీ5 హెలీకాప్టర్లో జనరల్ బిపిన్ రావత్ సహా మరో 13 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం పై ఎయిర్ మార్షల్ మానవేందర్ సింగ్ నేతృత్వంలోని కమిటీ విచారణ చేపట్టి.. త్రి సేవల కోర్టు ఆదేశాల మేరకు నివేదిక సమర్పించింది.

Also Read: Oldest Tortoise: గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 190 ఏళ్ల తాబేలు

నివేదిక ప్రకారం.. కమిటీ సభ్యులు ప్రమాదానికి గురైన ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ సహా ప్రత్యక్ష సాక్షులను సైతం విచారించారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో ఎటువంటి సాంకేతిక లోపం లేదని, అదే సమయంలో ప్రమాదంలో కుట్ర కోణం కూడా లేదని కమిటీ సభ్యులు తేల్చిచెప్పారు. హెలీకాప్టర్ అకస్మాత్తుగా దట్టమైన మేఘాల్లోకి ప్రవేశించగా ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్పష్టం చేశారు. ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యం కారణమంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేసిన కమిటీ సభ్యులు, ప్రమాద సమయంలో పైలట్ లు చాకచక్యంగా వ్యవహరించేందుకు ప్రయత్నించి ఉంటారని భావించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

Also read: Covid Danger: ఆ జీన్ ఉన్న 27 శాతం మంది భారతీయులకు కరోనా పెనుముప్పు