వ్యాక్సిన్ కారణంగా కరోనా ప్రమాదం తక్కువవుతుంది.. పూర్తిగా పోదు..

వ్యాక్సిన్ కారణంగా కరోనా ప్రమాదం తక్కువవుతుంది.. పూర్తిగా పోదు..

Covid Vaccine

కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వగా.. ఇప్పుడు సామాన్యులకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకునే విషయంలో ప్రతి ఒక్కరికి ఎన్నో అనుమానాలు.. వ్యాక్సిన్‌ తీసుకున్నంత మాత్రాన కరోనా రాదా? వ్యాక్సిన్‌ తీసుకున్న వారు స్వేచ్ఛగా తిరిగేయవచ్చా…? కరోనాకు అసలు భయపడాల్సిన పనిలేదా…? మాస్కులు ధరించాలా? భౌతిక దూరం పాటించాలా? అక్కర్లేదా..? ఇటువంటి ప్రశ్నలకు ఇప్పటివరకు చాలామందికి సమాధానం దొరకట్లేదు.

కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత.. వ్యాక్సిన్‌ తీసుకోగానే వైరస్ నుంచి విముక్తి పొందినట్లే అని అందరూ భావించారు కానీ, కరోనా వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్న తర్వాత కూడా చాలామందికి కరోనా వైరస్ సోకినట్లుగా వార్తలు రావడంతో వ్యాక్సిన్ వల్ల ఒరిగేది ఏం లేదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

మెడిసిన్ జర్నల్, పరిశోధక బృందం నివేదిక ప్రకారం.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం – శాన్ డియాగో మరియు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం – లాస్ ఏంజిల్స్ హెల్త్‌కేర్ కార్మికుల నుండి సేకరించిన డేటాను బట్టి డిసెంబర్ 16 మరియు ఫిబ్రవరి 9 మధ్య (36,659 మొదటి మోతాదులు, 28,184 రెండవ మోతాదులు) ఫైజర్ లేదా మోడరనా వ్యాక్సిన్‌లను అందుకున్నారు.

అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా 379 మంది వ్యక్తులు టీకాలు వేసుకున్న తరువాత కూడా SARS-CoV-2కు కరోనా పాజిటివ్ అయ్యారు. అందులోనూ 71% మందికి మొదటి మోతాదు తర్వాత మొదటి రెండు వారాల్లోనే కరోనా పాజిటివ్ వచ్చింది. 37మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులకు రెండు మోతాదులను పొందిన తరువాత పాజిటివ్ వచ్చింది. రెండు టీకాలు తీసుకున్న తర్వాతే గరిష్ట రోగనిరోధక శక్తి పొందినట్లుగా చెబుతున్నారు.

శరీరంలో వ్యాక్సిన్ ప్రభావం చూపేందుకు పది నుంచి 14 రోజుల సమయం పడుతుందని నిపుణులు ముందుగానే చెప్పగా.. లేటెస్ట్ అధ్యయనాలను చూస్తే.. మొదటి డోసు తర్వాత 50 శాతానికి పైగా మాత్రమే రోగనిరోధక శక్తి వస్తుందంటున్నారు నిపుణులు. రెండో డోసు తీసుకున్న 14రోజుల తర్వాత పూర్తిగా వైరస్‌ను ఎదుర్కోనే శక్తి వస్తుందని చెబుతున్నారు.