వరదల కారణంగా రూ.14వేల కోట్ల నష్టం

వరదల కారణంగా రూ.14వేల కోట్ల నష్టం

పదేళ్లుగా వస్తున్న వరదల ధాటికి ముంబైలో దాదాపు రూ.14వేల కోట్ల నష్టం వాటిల్లింది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ)తెలిపిన వివరాల ప్రకారం.. నష్టాలు జరిగాయి. అంతేకాదు, ఈ పదేళ్లలో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా జులై 2005న ముంబై సిటీలో 944మి.మీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

ముంబై ఈ వర్షాల ధాటికి అతలాకుతలం అయింది. ఈ పరిణామానికి ముంబై ప్రతి వర్షాకాలానికి ముందు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఏడాది వర్షాలకు ముంబై వాసులు మోకాళ్లలోతు నీళ్లలో అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఎలా అంటే వర్షం నీటిలో రైల్వే ట్రాక్‌లు సైతం మునిగిపోయాయి. నడుం వరకూ నీటిలో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడారు. 15వందల మందిని భారీ వరదల నుంచి కాపాడారు. 

ఈ వరదల్లో జనావాసాలు కోల్పోవడమే కాకుండా, పరిశమ్రల్లోకి నీళ్లు వచ్చి ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. పనులు లేకుండా ఇబ్బందులు పడుతూ.. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి. ఆపదలో ఉన్న వారిని డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా కనుగొని వారికి తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని అధికారులు చెప్పుకొస్తున్నారు.