RSS : ఆర్ఎస్ఎస్ లో కీలక మార్పు

ఆర్ఎస్ఎస్ - బీజేపీ మధ్య సమన్వయ కర్తగా సీనియర్ ప్రచారక్ అరుణ్ కుమార్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కీలక ప్రకటన చేసింది. లక్నోలోని చిత్రకూట్‌లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

RSS : ఆర్ఎస్ఎస్ లో కీలక మార్పు

Rss

RSS : ఆర్ఎస్ఎస్ – బీజేపీ మధ్య సమన్వయ కర్తగా సీనియర్ ప్రచారక్ అరుణ్ కుమార్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కీలక ప్రకటన చేసింది. లక్నోలోని చిత్రకూట్‌లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక గతంలో ఈ వ్యవహారాలను సీనియర్ ప్రచారక్ కృష్ణగోపాల్ చూసేవారు. ఈయన స్థానంలో అరుణ్ కుమార్‌ ను నియమించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కాగా ప్రస్తుతం అరుణ్ కుమార్ సహ సర్‌కార్యవాహ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సంఘ్ లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే బీజేపీలో పనిచేసిన కొందరు నేతలు రాజకీయాలను వదిలి సంఘ్ కార్యకలాపాల నిర్వహణకు వెళ్లారు.