Russia Sputnik V Jabs : భారత్‌‌కు స్పుత్నిక్ V వ్యాక్సిన్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ముందుగా ప్రారంభమయ్యే అవకాశం

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు మే మూడో వారంలో భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. దేశంలోకి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రాగానే పలు రాష్ట్రాల్లోని ప్రైవైట్ ఆస్పత్రుల్లోనే ముందుగా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Russia Sputnik V Jabs : భారత్‌‌కు స్పుత్నిక్ V వ్యాక్సిన్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ముందుగా ప్రారంభమయ్యే అవకాశం

Russia Sputnik V Jabs Set To Make India Debut At Private Hopsitals (2)

Russia Sputnik V Jabs : రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు మే మూడో వారంలో భారత్ కు మరిన్ని చేరుకునే అవకాశం ఉంది. స్పుత్నిక్ వి మొదటి బ్యాచ్ శుక్రవారమే హైదరాబాద్ చేరుకుంది. స్పుత్నిక్ V మొదటి భాగంలో టీకా 1.5 లక్షల మోతాదులు అందాయి. ఈ టీకాను మొదట కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీలో పరీక్షించటానికి రెడీగా ఉన్నాయి. మిగిలిన డోసులు అందిన వెంటనే పలు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ముందుగా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్పుత్నిక్ వి మొదటి డోసును అందించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి జాబితాను కూడా సిద్ధం చేసినట్టు ప్రైవేటు ఆస్పత్రులు, డాక్టర్ రెడ్డీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

దేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి కేంద్రంతో కూడా పలు దాఫాలుగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దాంతో వచ్చే ఆగస్టు-సెప్టెంబర్ నెలలో దేశీయ వ్యాక్సిన్ తయారీకేంద్రాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ తయారీ కేంద్రాల నుంచి 850 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. స్వదేశీ వినియోగంతో పాటు విదేశాల కోసం అందించగలవు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి డీఆర్ఎల్ (రెడ్డీస్ ల్యాబ్)తో చర్చలు జరుపుతున్నామని ముంబై ఆధారిత ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

మే చివరి వారం నుంచి దేశంలోని ప్రైవేటు కోవిడ్ వ్యాక్సిన్ల సెంటర్లలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మొదటి డోసు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రష్యా నుంచి 40మిలియన్ల నుంచి 50 మిలియన్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులు దిగుమతి కానున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 91.6 ప్రభావంతమని తేలగా.. ఇతర వ్యాక్సిన్లతో పాటు ఇప్పుడు ఈ రష్యా కోవిడ్ వ్యాక్సిన్ కూడా భారత మార్కెట్లోకి అందుబాటులో ఉండనుంది. ఈ వ్యాక్సిన్ నిల్వ చేయడానికి -18డిగ్రీల సెల్సియస్ నుంచి -22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది. ప్రపంచంలో రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తిలో 60శాతం నుంచి 70 శాతం వరకు భారత్ లోనే ఉత్పత్తి కానున్నట్టు డీఆర్ఎల్ పేర్కొంది.