Sanjay Raut wife: సంజయ్ రౌత్ భార్య వర్షకు ఈడీ సమన్లు

పాత్రా చాల్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా రూ.11.15 కోట్ల విలువైన వర్షా రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

Sanjay Raut wife: సంజయ్ రౌత్ భార్య వర్షకు ఈడీ సమన్లు

Sanjay Raut wife: పాత్రా చాల్ కుంభకోణంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం ఆమెకు ఈడీ సమన్లు జరీ చేసినట్లు సమాచారం. ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పటీకే ఈడీ.. సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Kerala Man: స్కేట్‌బోర్డుపై కాశ్మీర్ యాత్ర చేస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ప్రస్తుతం ఆయన కోర్టు ఆదేశాలతో ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా వర్షను ఈడీ విచారించింది. పీఎమ్‌సీ బ్యాంక్ స్కామ్ కేసు గురించి ఈడీ గత జనవరిలో వర్షను విచారించింది. తాజా కేసుకు సంబంధించి మాధురి ప్రవీణ్ రౌత్ నుంచి వర్షా రౌత్ దాదాపు రూ.55 లక్షలు అక్రమంగా తీసుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. పాత్రా చాల్ కుంభకోణం విలువ దాదాపు రూ.1,034 కోట్లు. ఈ విచారణలో భాగంగా గతంలోనే సంజయ్ రౌత్ బంధువు ప్రవీణ్ రౌత్ అరెస్టై, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

Anupama Parameswaran: కార్తికేయ-2 ప్రెస్ మీట్ కోసం ముస్తాబైన అందాల అనుపమ

ఈ ఏడాది ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన రూ.11 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరోవైపు సంజయ్ రౌత్ ఈడీ కస్టడీ ఈ నెల 8 వరకు పొడిగించినట్లు సమాచారం. వర్షా రౌత్‌కు ఈడీ తాజాగా జారీ చేసిన నోటీసుల ప్రకారం.. ఆమె ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సంజయ్ రౌత్ ఈడీ విచారణను శివసేన నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఖండించారు.