SBI Card : క్రెడిట్ కార్డు యూజర్లకు ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్.. 3 రోజులే.. | SBI Card to start three-day festive cashback offer

SBI Card : క్రెడిట్ కార్డు యూజర్లకు ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్.. 3 రోజులే..

పండుగ సీజన్‌ వచ్చేస్తోంది. పండుగ సందర్భంగా కొనుగోళ్లు చేయడం కామన్. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తలు భారీగా కొంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు

SBI Card : క్రెడిట్ కార్డు యూజర్లకు ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్.. 3 రోజులే..

SBI Card Offer : పండుగ సీజన్‌ వచ్చేస్తోంది. పండుగ సందర్భంగా కొనుగోళ్లు చేయడం కామన్. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తలు భారీగా కొంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు రెడీ అయ్యాయి. పండుగ పేరుతో సేల్స్ అనౌన్స్ చేస్తున్నాయి. అదిరిపోయే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో కొనుగోలుదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

తాజాగా దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ సైతం రంగంలోకి దిగింది. ఎస్బీఐ కార్డ్స్‌ తమ క్రెడిట్ కార్డు యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఏ ఈ-కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసినా ఈ ఆఫర్‌ వర్తిస్తుందని చెప్పింది.

Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.100 కే గోల్డ్..!

అలాగే మొబైల్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, హోం డెకర్‌, కిచెన్‌ అప్లయన్సెస్‌.. ఇలా ఏ కేటగిరీలోని వస్తువులు కొన్నా.. క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఈఎంఐ ఆప్షన్‌ ఎంచుకున్నా ఈ ఆఫర్‌ వర్తించనున్నట్లు తెలిపింది. అయితే, కొనే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఈ పరిమితకాల ఆఫర్‌ అక్టోబర్‌ 3న ప్రారంభమై.. 5న ముగియనుంది. కేవలం మూడు రోజులు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఆ మూడు రోజుల సమయంలో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు కూడా కల్పిస్తామని ఎస్బీఐ తెలిపింది.

Diwali With Mi Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై రూ.75వేల వరకు డిస్కౌంట్.. షావోమీ అదిరిపోయే ఆఫర్లు

అయితే ఈ ఆఫర్ కొన్ని కేటగిరీలకు ఇన్సురెన్స్, ట్రావెల్, వాలెట్, జువెలరీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, యుటిలిటీ మర్చంట్స్ కు వర్తించదని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో మోహన్ రావ్ అమరా చెప్పారు.

×