SBI Home Loan : కొత్త ఇల్లు కొనేవారికి ఎస్బీఐ గుడ్‌న్యూస్

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. తమ కంటూ ఓ ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. సొంతిల్లు ఉంటే అద్దెలు కట్టే బాధ తప్పుతుంది. ప్రతి ఒక్కరి ప్రాధమిక అవసరం ఇల్లు. ఏది ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ ఇల్లు ఉంటే చాలంటారు. అందుకే అప్పో సప్పో చేసి ఇల్లు కొనాలని ఆశపడుతుంటారు. అయితే సొంతింటి కల నేరవేర్చుకోవడం అంత ఈజీ కాదు.

SBI Home Loan : కొత్త ఇల్లు కొనేవారికి ఎస్బీఐ గుడ్‌న్యూస్

Sbi Home Loan

SBI Home Loan : సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. తమ కంటూ ఓ ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. సొంతిల్లు ఉంటే అద్దెలు కట్టే బాధ తప్పుతుంది. ప్రతి ఒక్కరి ప్రాధమిక అవసరం ఇల్లు. ఏది ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ ఇల్లు ఉంటే చాలంటారు. అందుకే అప్పో సప్పో చేసి ఇల్లు కొనాలని ఆశపడుతుంటారు. అయితే సొంతింటి కల నేరవేర్చుకోవడం అంత ఈజీ కాదు. చాలా డబ్బు అవసరం అవుతుంది. ఈ పరిస్థితుల్లో తక్కువ ఇంట్రస్ట్ కే బ్యాంకు లోన్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వారికి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది.

Honey Trap : హనీ ట్రాప్ అంటే ఏమిటి? ఎలా చేస్తారు?

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గృహ రుణాలపై(హోమ్ లోన్స్) ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదని ప్రకటించింది. “ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున, గృహ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి” అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

గృహ రుణాలపై ప్రయోజనాలు…
* ఎస్బీఐ ఖాతాదారులకు గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
* ఎస్‌బీఐ మహిళా ఖాతాదారులకు 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది.
* యోనో ద్వారా అప్లయ్ చేస్తే 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది.
* ఎస్‌బీఐ కస్టమర్లకు 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు.
* రుణగ్రహీతలు గృహ రుణం కొరకు 7208933140 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు.