SBI Fellowship 2021 : డిగ్రీ పాస్ అయితే చాలు.. నెలకు రూ.50వేలు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిగ్రీ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ పాస్ అయ్యి గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఫెలోషిప్ అవకాశాన్ని ఇస్తోంది ఎస్బీఐ. ప్రతీ ఏటా 'ఎస్‌బీఐ యూత్ ఫర్

SBI Fellowship 2021 : డిగ్రీ పాస్ అయితే చాలు.. నెలకు రూ.50వేలు

Sbi Fellowship 2021

SBI Fellowship 2021 : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిగ్రీ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ పాస్ అయ్యి గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఫెలోషిప్ అవకాశాన్ని ఇస్తోంది ఎస్బీఐ. ప్రతీ ఏటా ‘ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో ఇదొక భాగం.

ప్రస్తుతం ‘ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ 2021-22 బ్యాచ్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారు 13 నెలల పాటు గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో పర్యటించాలి. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధ్యయనం చేయాలి. ప్రముఖ ఎన్‌జీఓ ప్రతినిధులు, నిపుణులు ఫెలోస్‌కి సహకారం అందిస్తారు. ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి నెలకు రూ.50వేలు ఫెలోషిప్ లభిస్తుంది.

ఫెలోషిప్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఫెలోషిప్ పూర్తయిన తర్వాత ఎస్‌బీఐ అల్యూమ్నీ, భాగస్వాములు, సంబంధిత సంస్థల్లో సేవలు అందించొచ్చు. ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేయడానికి 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. పూర్తి వివరాలను https://youthforindia.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఫెలోషిప్ కి అర్హతలు:
* డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి
* వయసు 21 నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి.
* 13 నెలల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు కమిట్ అవ్వాలి.
* టీమ్ ప్లేయర్ గా వ్యవహరించాలి.

ఫెలోషిప్ లక్ష్యం:
* ఎడ్యుకేటడ్ ఇండియన్ యూత్ ని అందించడమే లక్ష్యం.
* గ్రామీణాభివృద్ధికి తోడ్పాటు
* గ్రామాల అభివృద్ధికి ఐడియాలు తెలపాలి

అప్లికేషన్ దశలు:
* ముందుగా అప్లికేషన్ నింపాలి.
* అప్లికెంట్స్.. వారి ఆలోచనలను వ్యాసం రూపంలో రాసి పంపాలి.
* ఆ తర్వాత ఇంటర్వ్యూ
* ఇంటర్వ్యూలో పర్సనాలిటీ అసెస్ మెంట్

ఫెలోషిప్ కి ఎంపికైన వారు పని చేయాల్సిన టాపిక్స్:
* విద్య
* మహిళా సాధికారత
* నీరు
* సాంకేతికత
* గ్రామీన జీవనం
* సెల్ఫ్ గవర్నెర్స్
* ఆరోగ్యం
* ఆహార భద్రత
* పర్యావరణ పరిరక్షణ
* ప్రత్యామ్నాయ శక్తి