ముందుకొస్తుందట : చెన్నైకి సముద్ర ముప్పు

తమిళనాడు రాజధాని చెన్నైకి సముద్ర ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఏటేటా సముద్రం ముందుకు జరుగుతూ వస్తుందట.

  • Published By: venkaiahnaidu ,Published On : April 22, 2019 / 05:51 AM IST
ముందుకొస్తుందట : చెన్నైకి సముద్ర ముప్పు

తమిళనాడు రాజధాని చెన్నైకి సముద్ర ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఏటేటా సముద్రం ముందుకు జరుగుతూ వస్తుందట.

తమిళనాడు రాజధాని చెన్నైకి సముద్ర ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఏటేటా సముద్రం ముందుకు జరుగుతూ వస్తుందట. సీ లెవల్స్ పెరుగుతూ ఉండటంతో 2100నాటికి చెన్నైలోని పలు ప్రాంతాలు సముద్రంలో కలిసిపోయే అవకాశముంది.అన్నా యూనివర్శిటీ,నేషనల్ వాటర్ సెంటర్,యూఏఈ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది.
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు

ప్రస్థుతమున్న తీరం నుంచి సుముద్రపు నీరు 40మీటర్లు ల్యాండ్ పైకి జరుగుతుందని ఈ స్టడీలో తేలింది.అంతేకాకుండా  సముద్రపు నీరు ముందుకొచ్చినప్పుడు గ్రౌండ్ వాటర్ తో అది మిక్స్ అయి నీటిని నిలువ చేసి ప్రసరింపచేయగల నేలలోని రాతిపొరపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో తేలినట్లు అన్నా యూనివర్శిటీ జియాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ ఎల్.ఇలాంగో తెలిపారు. ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ అసెస్మెంట్ జర్నల్ లో ఈ స్టడీ పబ్లిష్ అయింది.

గడిచిన 50 ఏళ్లుగా సముద్ర స్థాయి 3.66మిల్లీ మీటర్లు పెరిగింది,హియాలయాల్లో మంచు కరగడం వల్ల బంగాళాఖాతంలో ఏడాది సీ లెవల్ పెరిగింది.ఇతర ఆసియన్ ప్రాంతాలన్నింటిలోకెల్లా బంగాళాఖాతంలో ఎక్కువగా పెరినట్లు కన్పిస్తోంది.2007నాటి ఓ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.సీ లెవల్ ఒక్క మీటరు పెరిగినా దాదాపు 60కిలోమీటర్ల తీరప్రాంత భూభాగాన్ని ముంచెత్తగలదు.
Also Read : బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు