Punjab Politics : పంజాబ్ రాజకీయాలపై ఆప్ ఫోకస్

కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయస్థితిలో ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా కామెంట్ చేశారు.

Punjab Politics : పంజాబ్ రాజకీయాలపై ఆప్ ఫోకస్

Aap

Aam Aadmi Party – Punjab : పంజాబ్ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పలు పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాయి. పలు పార్టీల మధ్య పొత్తులు కుదుర్చుకొనేందుకు రెడీ అవుతున్నాయి. బీఎస్పీతో అకాలీదళ్ పొత్తు కుదరడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న ఆప్..పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. SAD -BSP పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ పంజాబ్ రాజకీయాలపై ఆప్ ఫొకస్ పెట్టింది.

కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయస్థితిలో ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా కామెంట్ చేశారు. 2 – 3 ఏళ్లలో కెప్టెన్ సాబ్ 800ల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని ఆరోపించడం గమనార్హం. అమరీందర్ వైఫల్యాలను దాచడానికి పంజాబ్ పాఠశాలలు అత్యుత్తమం అంటూ ప్రధాన మంత్రి మోదీ నివేదికలు ఇచ్చారని, ఇది పీఎం – అమరీందర్ల మధ్య జుగల్ బంది అని ఎద్దేవా చేశారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిచిన ఆప్…ఎక్కువ స్థానాలు గెలిచిన రెండో అతిపెద్ద పార్టీగా ఆప్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. 2014 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకుని పంజాబ్ గడ్డపై తన సత్తా ఏంటో చూపెట్టింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుందో వేచి చూడాలి.

Read More : Covid-19 Duty: కోవిడ్ విధుల్లో తొమ్మిది నెలల గర్భవతి