Republic Day: రిపబ్లిక్ డే రోజు ఉగ్రవాదులు దాడులు చేయవచ్చు-నిఘా వర్గాల హెచ్చరిక

జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 

Republic Day: రిపబ్లిక్ డే రోజు  ఉగ్రవాదులు దాడులు చేయవచ్చు-నిఘా వర్గాల హెచ్చరిక

Republic Day PM Modi

Republic Day :  జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.  ఈ ఏడాది  జనవరి 26 న  జరిగే 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలైన కజికిస్తాన్, కర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్,  ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలు ముఖ్య అతిధులుగా హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు దాడులు చేసే అవకాసం ఉందని నిఘావర్గాలకు సమాచారం అందింది.  దేశరాజధాని ఢిల్లీతో సహా పంజాబ్, ఇతర నగరాల్లో ఉగ్రవాదుల దాడులు జరగవచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రజలు ఎక్కువగా గూమి కూడే ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో, కీలకమైన కట్టడాలు లక్ష్యంగా దాడులకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కోన్నాయి. డ్రోన్లతో దాడికి పాల్పడే అవకాశం ఉందని తెలిపాయి.

ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబా, రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహమ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్   ముజాహిదీన్ వంటి తీవ్రవాద సంస్ధల హస్తం ఉన్నట్లు అంచనా వేశారు.  పాకిస్తాన్ లోని ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్ లో దాడుల కోసం మానవ వనరులను సమీకరించుకుంటున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది.

Also Read : Corona Positive : తెలంగాణలో కరోనా విజృంభణ.. బీఆర్‌కే భవన్‌లో ఐఏఎస్‌లు, ఉద్యోగులు.. పోలీసులకు పాజిటివ్

మరో వైపు హైదరాబాద్ బీజేపీ కార్యాలయాన్ని ఉగ్రవాదులు టార్గెట్‌గా   చేసుకున్నారని రాష్ట్ర  నిఘావర్గాలకు సమాచారం అందినట్లు  తెలుస్తోంది. దీంతో పార్టీ కార్యాలయానికి  ముప్పు పొంచి ఉందని నిఘావర్గాల హెచ్చరించాయి.  నాంపల్లి లోని  పార్టీ  కార్యాలయానికి పార్టీతో సంబంధం లేని వ్యక్తులు అందరూ వస్తున్నారని… వారిపై మానిటరింగ్  లేదని హెచ్చరించారు.  పార్టీకి చెందిన ముఖ్య నేతలు   పార్టీ కార్యాలయానికి  వెళ్లడం మంచిది కాదని  సూచించింది.