Summer Heat Waves : భానుడి భగభగలకు అల్లాడుతున్న జనం

దేశంలో భానుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృధ్ధులు అల్లాడిపోతున్నారు.

Summer Heat Waves : భానుడి భగభగలకు అల్లాడుతున్న జనం

Summer Heat Waves

Summer Heat Waves :  దేశంలో భానుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృధ్ధులు అల్లాడిపోతున్నారు. నడివయస్కులు కూడా ఎండలో బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్ధితి వచ్చింది. ఉత్తర, వాయువ్య, మధ్య భారతంలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుఅవుతున్నాయి. 122 ఏళ్లలో అత్యంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో నమోదయ్యాయని భారత వాతావరణశాఖ తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర భారతంలో 40 డిగ్రీలకు పైన, వాయువ్య భారతంలో 35.90 డిగ్రీలు, మధ్య భారతంలో 37.78డిగ్రీలు నమోదయ్యాయి. దక్షిణ భారతంలోని కొన్నిరాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ తో సహా పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్ల మార్చి ఉష్ణోగ్రతల్లో ఇదే కొత్త రికార్డు అని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది‌. తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే మే నెలలో ఎండలు 44 నుంచి 46 డిగ్రీలకు ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఎండలు మండి పోతున్నాయి. విశాఖ, విజయనగరం, కర్నూలు, తిరుపతిలోనూ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగుతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తిరుపతిలో అత్యధికంగా 45 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదుకావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Also Read : Krithi Shetty : పూల చీరలో పరిమళాలు వెదజల్లుతున్న కృతి
మరోవైపు నైరుతి రుతుపవనాల ముందస్తు అంచనాలను భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాకాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాయువ్య ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ ద్వీపకల్పంలో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది.

పశ్చిమ-మధ్య, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.