Assam Cm and Shahrukh: షారూక్ ఎవరన్న అస్సాం సీఎం.. అర్థరాత్రి సీఎంకు ఫోన్‌చేసి భద్రత కోరిన షారూక్..

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నాకు కాల్ చేశాడని అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ చెప్పారు. మేమిద్దరం అర్థరాత్రి 2గంటల సమయంలో మాట్లాడుకున్నాం. తన సినిమా ప్రదర్శన సందర్భంగా గౌహతిలో జరిగిన ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని నేను అతనికి హామీ ఇచ్చాను అని అన్నారు.

Assam Cm and Shahrukh: షారూక్ ఎవరన్న అస్సాం సీఎం.. అర్థరాత్రి సీఎంకు ఫోన్‌చేసి భద్రత కోరిన షారూక్..

Assam Cm Himanta Biswa Sarma

Assam Cm and Shahrukh: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ యూ-టర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. షారూక్ ఖాన్ ఎవరో నాకు తెలియదని చెప్పిన కొద్దిగంటల్లోనే షారూక్ ఖాన్ సీఎంకు ఫోన్ చేయడంతో సీఎం మొత్తపడ్డాడు. షారూక్ పఠాన్ సినిమాకు పూర్తి భద్రత కల్పిస్తామని, అది ప్రభుత్వం బాధ్యత అంటూ ఆదివారం ఉదయం తన ట్విటర్ ఖాతాద్వారా పేర్కొన్నారు. షారూక్ ఖాన్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పఠాన్ సినిమా 25న విడుదల కానుంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం విధితమే.

Assam CM on Pathaan: షారూఖ్ ఖాన్ ఎవరో కూడా తెలియదట.. పఠాన్ సినిమా వివాదంపై అస్సాం సీఎం కామెంట్స్

గౌహతి థియేటర్లలో పఠాన్ పోస్టర్లను భజరంగ్ దళ్ కార్యకర్తలు దగ్దం చేశారు. ఈ క్రమంలో ఈనెల 21న స్థానిక విలేకరులు ఈ విషయాన్ని సీఎ హిమంతను ప్రశ్నించారు. షారుఖ్ ఖాన్ ఎవరు?, అతడి గురించి, అతడి సినిమా పఠాన్ గురించి నాకేమీ తెలియదు అంటూ శర్మ బదులిచ్చాడు. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది తనకు ఫోన్ చేస్తుంటారని, షారుక్ ఖాన్ మాట్లాడరని చెప్పారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రజలు అస్సామీ మినహా హిందీ సినిమాల గురించి పట్టించుకోరని సీఎం వ్యాఖ్యానించాడు.

 

సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో షారూఖ్ ఖాన్ స్పందించి, అర్థరాత్రి సమయంలో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఇదే విషయాన్ని ఆదివారం ఉదయం అస్సా సీఎం ట్విటర్ ద్వారా వెల్లడించారు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నాకు కాల్ చేశాడు. మేమిద్దరం అర్థరాత్రి 2గంటల సమయంలో మాట్లాడుకున్నాం. తన సినిమా ప్రదర్శన సందర్భంగా గౌహతిలో జరిగిన ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని నేను అతనికి హామీ ఇచ్చాను. మేము విచారించి, అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం అని సీఎం హిమంత బిస్వాశర్మ అన్నాడు.