Shashi Tharoor: సోషల్ మీడియాలో ఖర్గే, సోనియాతో తీసుకున్న ఫొటో షేర్ చేసిన శశి థరూర్

పోలింగ్‭కు ముందే తన ఓటమిని దాదాపుగా అంగీకరించిన థరూర్.. ఎన్నిక ఫలితాలు రాగానే ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికకు ముందు జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు రావాలని, అందుకు తనను ఎన్నుకోవాలని థరూర్ చెప్పారు. పరోక్షంగా గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని ఆయన వ్యతిరేకించారు. తనను గెలిపిస్తే అధిష్టానం అనే ధోరణిని తొలగించి రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తానని అన్నారు

Shashi Tharoor: సోషల్ మీడియాలో ఖర్గే, సోనియాతో తీసుకున్న ఫొటో షేర్ చేసిన శశి థరూర్

Shashi Tharoor Shares Pic Of Him With M Kharge, Sonia Gandhi

Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలో మల్లికార్జున ఖర్గేపై పోటీ చేయడమే కాకుండా.. కాంగ్రెస్ అధిష్టానంపై కూడా విమర్శలు గుప్పించిన శశి థరూర్.. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఫొటో చేశారు. అంతే కాకుండా దానికి మరింత ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో చేశారు. ‘‘ఖర్గేజీ కొత్త ఆఫీసులో ఆసీనులయ్యాక.. ఆయనతో పాటు కాసేపు చర్చించే అవకాశం లభించి ఇలా కూర్చున్నాం. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నా పూర్తి మద్దతు, సహకారం ఆయనకు ఎప్పటికీ ఉంటాయని ప్రమాణం చేశాను’’ అని ట్వీట్ చేశారు.

పోలింగ్‭కు ముందే తన ఓటమిని దాదాపుగా అంగీకరించిన థరూర్.. ఎన్నిక ఫలితాలు రాగానే ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికకు ముందు జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు రావాలని, అందుకు తనను ఎన్నుకోవాలని థరూర్ చెప్పారు. పరోక్షంగా గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని ఆయన వ్యతిరేకించారు. తనను గెలిపిస్తే అధిష్టానం అనే ధోరణిని తొలగించి రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తానని అన్నారు. అయితే తాజా ట్వీట్‭తో అవన్నీ కేవలం ఎన్నికల వరకే పరిమితమని, అవి ముగిసిన తర్వాత తామంతా కాంగ్రెస్ కుటుంబీకులమని థరూర్ నిరూపించారని నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక 24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర వ్యక్తి అధ్యక్షులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఖర్గే 53 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన సిటీ కాంగ్రెస్ అధ్యక్షడి నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడి పదవికి చేరుకున్నారు. లోక్ సభ, రాజ్యసభ పక్ష నేతగా, 10 ఏళ్ళు కేంద్ర మంత్రిగా, 9 సార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పని చేశారు. కాగా, మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్‌పై 84 శాతం ఓట్లతో విజయం సాధించారు.

Indian origin CEOs : సీఈవోల ఫ్యాక్టరీగా భారత్ .. ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పోరేట్ కంపెనీల్లో భారతీయుల హవా..