యోగి ఆదిత్యనాథ్‌ని నిలదీసిన నూస్రత్ జహాన్

యోగి ఆదిత్యనాథ్‌ని నిలదీసిన నూస్రత్ జహాన్

Nusrat Jahan's Attack As Yogi Adityanath Campaigns In Bengal

Nusrat Jahan on Yogi Adityanath: మహిళల భద్రత కంటే బీజేపీ ఎన్నికలే ఎక్కువైపోయాయా.. అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నూస్రత్ జహాన్ మంగళవారం యూపీ సీఎం యోగిని నిలదీశారు. మహిళను లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో వ్యక్తిని నిలదీసిన తండ్రిని కాల్చి చంపేశాడు. సదరు వ్యక్తిని బెయిల్ పై విడుదల చేయడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ రాష్ట్రంలో పెరిగిపోతున్న నేరాలను పట్టించుకోవడం లేదు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో ప్రజలకు సేఫ్టీ లేకుండాపోయింది. బీజేపీ ఎన్నికలే ఎక్కువైపోయాయి అని ఆరోపించారు.

‘షాకింగ్ గా ఉంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ భయంకరమైన వాతావరణాన్ని ప్రకటించడానికి మాటలు రావడం లేదు. యోగి ఆదిత్యనాథ్ ఈ కుటుంబానికి భద్రత ఎందుకు కల్పించలేకపోతున్నారు. దానికంటే బీజేపీకి బెంగాల్ ఎన్నికలే ఎక్కువైపోయాయా’ అని ప్రశ్నించారు.

బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగిఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బెంగాల్ లో పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రజలు బాధలో ఉన్నారు. సెక్యూరిటీ అనేది చాలా కీలకం. బెంగాల్ లో మార్పు వస్తుందని మాటిస్తున్నాం’ అంటూ ప్రసంగించారు. దీనిపై స్పందించిన తృణమూల్ ఎంపీ ఇలా స్పందించారు.

మహిళ కుటుంబంపై సేఫ్టీ, సెక్యూరిటీ ఎలా చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. దానికంటే బెంగాల్ ఎన్నికలకే ప్రియారిటీ ఇస్తున్నారా.. మహిళల భద్రతపై యోగి ఆదిత్యనాథ్ ఎంత అప్రమత్తంగా ఉన్నారో అర్థం అవుతుందని కోల్‌కతా మేయర్ ట్వీట్ చేశారు.

అంతేకాకుండా క్యాబినెట్ మినిష్టర్ ఫిర్హాద్ హకీమ్, ఎంపీ డా.కకోలీ ఘోష్ దస్తీదార్ హత్రాస్ ఘటనను ప్రస్తావిస్తూ.. ‘బీజేపీ హటావో – భేటీ బచావో’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.