Karnataka: సావర్కర్, హెగ్డేవార్ పాఠాలు తొలగిస్తారా? కర్ణాటక సీఎం ఏం అన్నారు?

కర్ణాటక 10వ తరగతి పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చారు. ఇక డార్విన్ పాఠాన్ని తొలగించి, ఆ స్థానంలో సావర్కర్ పాఠాన్ని చేర్చారు. ఈ రెండు సందర్భాల్లోనూ రాష్ట్రంలో పెద్ద దుమారం లేసింది

Karnataka: సావర్కర్, హెగ్డేవార్ పాఠాలు తొలగిస్తారా? కర్ణాటక సీఎం ఏం అన్నారు?

CM Siddaramaiah

Siddaramaiah: కర్ణాటక పాఠశాల పాఠ్యపుస్తకాల్లో సావర్కర్, హెగ్డేవార్ పాఠాలను చేర్చడం అప్పట్లో పెద్ద వివాదామైంది. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోని ఈ పాఠ్యాంశాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించనుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కారణం, తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు. విద్యార్థుల్ని ఆలోచనల్ని విషతుల్యం చేసే పుస్తకాలను, పాఠాలను ఎంతమాత్రం సహించేది లేదని తాజాగా ఆయన తేల్చి చెప్పారు. విషయం స్పష్టంగా బయటికి చెప్పటనప్పటికీ.. బీజేపీ హయాంలో చేర్చిన పాఠాలు లక్ష్యంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా, ఆ పాఠాలను తొలగించనున్నట్లు కూడా ఆయన సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

IPL2023 Final: ఐపీఎల్‌-16 టైటిల్ విజేత‌గా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ పై విజ‌యం

ఈ విషయై ఆయన మాట్లాడుతూ ‘‘విద్యార్థుల ఆలోచనలను విషతుల్యం చేసే ఎలాంటి చర్యను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము. ఇప్పటికే దాదాపుగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అయితే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దీనిపై వీలైతనంత తొందరగా చర్చలు చేసి నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు. బీజేపీ ప్రవేశ పెట్టిన పాఠాలను తొలగించి, కొత్త పాఠాలను ఈ ఏడాది నుంచే అమలు చేసే ఆలోచనలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

#9YearsOfModiGovernment: నేటితో 9 ఏళ్ళ పాలనను పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం

కర్ణాటక 10వ తరగతి పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చారు. ఇక డార్విన్ పాఠాన్ని తొలగించి, ఆ స్థానంలో సావర్కర్ పాఠాన్ని చేర్చారు. ఈ రెండు సందర్భాల్లోనూ రాష్ట్రంలో పెద్ద దుమారం లేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు ముందు రాజ్యాంగ నిర్మాత అనే పదాన్ని తొలగించడంతో పాటు కువెంపు, కనకదాసు పాఠాలను యథాతథంగా పూర్తిగా తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. అయితే బసవణ్ణ పాఠాలలో కొద్దిపాటి మార్పులు చేసినట్లు సమాచారం.