Sidhu Moose Wala: సిద్ధూ మూసే వాలా హత్య కేసు… కాలిఫోర్నియా పోలీసుల అదుపులో కీలక సూత్రధారి గోల్డీ బ్రార్

ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న గోల్డీ బ్రార్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Sidhu Moose Wala: సిద్ధూ మూసే వాలా హత్య కేసు… కాలిఫోర్నియా పోలీసుల అదుపులో కీలక సూత్రధారి గోల్డీ బ్రార్

Sidhu Moose Wala: ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కాలిఫోర్నియా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. గత మే 29న పంజాబ్‌లో సింగర్, పొలిటీషియన్ అయిన సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో హతమయ్యాడు.

Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఇక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం గోల్డీ బ్రార్ సోషల్ మీడియా ద్వారా ఈ హత్యపై ఒక ప్రకటన చేశాడు. తనే ఈ హత్య చేయించినట్లు ప్రకటించాడు. గోల్డీ బ్రార్ కెనడాలో ఉండటంతో అతడ్ని పట్టుకోవడం సాధ్యం కాలేదు. తాజాగా గోల్డీ బ్రార్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత నెల 20నే అతడ్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

కానీ, భారత ఇంటెలిజెన్స్ విభాగాలైన ఐబీ, రా, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగానికి అనధికార సమాచారం అందింది. దీంతో గోల్డీ బ్రార్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో, పోలీసుల అదుపులో ఉన్నట్లు గుర్తించారు.