Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు

యూజ్డ్ కార్ల ప్లాట్‌ఫామ్ కార్స్24 తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 600 మందిని తొలగించింది.

Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు

Cars24 (1)

Cars24 Lays Off : యూజ్డ్ కార్ల ప్లాట్‌ఫామ్ కార్స్24 తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. లేఆఫ్స్ లో భాగంగా 600 మందిని తొలగించింది. పలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ లేఆఫ్స్‌ను చేపట్టింది. ఈ కంపెనీలో 9వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే, ఇది కాస్ట్ కటింగ్ లో భాగం కాదని, ప్రతి ఏటా జరిగేదే అని, బిజినెస్ లో సర్వ సాధారణంగా జరిగిదే అని యాజమాన్యం వివరించింది. అంతేకాదు, పనితీరు బాగోలేకపోవడంతోనే వేటు వేశామని సంస్థ తెలిపింది. తొలగించిన ఉద్యోగుల్లో ఎక్కువ మంది జూనియర్ పొజిషన్లలో పనిచేస్తున్న వారే ఉన్నారు.

P&O Sackings : జూమ్ కాల్‌‌లో 800 మంది ఉద్యోగుల తొలగింపు.. ప్రధాని గుస్సా

కార్స్24కి గత డిసెంబర్‌లోనే ఆల్ఫా వేవ్ గ్లోబల్ నుంచి 400 మిలియన్ డాలర్ల నిధులు అందాయి. దీనిలో 100 మిలియన్ డాలర్ల డెట్ కాంపోనెంట్ కూడా ఉంది. ఈ ఫండింగ్ తర్వాత కంపెనీ వాల్యూయేషన్ మూడింతలు పెరిగి 3.3 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అయితే ప్రస్తుత లేఆఫ్ ప్రతేడాది నిర్వహించే పనితీరు ఆధారితంగా చేపట్టిందని కార్స్24 సంస్థ ప్రతినిధి చెప్పారు. దీనికి లేఆఫ్ ముద్ర వేయడానికి ఆయన ఒప్పుకోలేదు.

మరోవైపు ప్రస్తుతం ఈ కంపెనీ అంతర్జాతీయంగా తన వ్యాపారాలను విస్తరించాలని చూస్తోంది. 2021లో ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయ్‌ల్యాండ్ మార్కెట్లలోకి అడుగు పెట్టింది. 2022లో మరో 6 నుంచి 7 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోంది. కార్స్24 విస్తరించాలనుకునే దేశాలలో సౌదీ అరేబియా, ఇండోనేషియా, మలేసియా, దక్షిణాసియా దేశాలున్నాయి.

Twitter Employees : ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన.. జాబ్ మానేస్తారా?.. పోతే పోండి.. డోంట్ కేర్ అంటున్న మస్క్..!

కాగా, స్టార్టప్ కంపెనీలు అనూహ్య నిర్ణయాలతో ఉద్యోగుల పొట్ట కొడుతున్నాయి. సడెన్ గా ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాయి. దీంతో వారు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇటీవలే అన్‌అకాడమీ, వేదాంతు, మీషో కంపెనీలు తమ ఉద్యోగులపై వేటు వేశాయి. ఇప్పుడు కార్స్ 24 వాటి సరసన చేరింది.