అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే : 10 లక్షలు పోయాయి

  • Published By: madhu ,Published On : February 18, 2019 / 01:00 PM IST
అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే : 10 లక్షలు పోయాయి

‘నా 10 లక్షలు పోయాయి..కనీసం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు…పేదోడిని…నా డబ్బును రికవరీ చేసి ఇవ్వండి…ఆ డబ్బు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఏడ్చాడు. ఆయన ఎవరో కాదు….సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఆయనకే న్యాయం జరగడం లేదంటే..ఇక సామాన్య పౌరుడి సంగతి వేరే చెప్పాలా ? ఎడ్చిన ఎమ్మెల్యే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కల్పనాథ్ పాశ్వాన్. 

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం యదావిధంగా అసెంబ్లీ సమావేశమైంది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కల్పనాథ్ జీరో హవర్‌లో మాట్లాడారు. అజమ్ ఘర్‌లోని ఓ హోటల్‌లో బస చేసినట్లు..తన దగ్గరున్న రూ. 10 లక్షలు ఎవరో దొంగిలించారని వాపోయారు. పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని..న్యాయం చేయండి అంటూ రెండు చేతులు జోడించి కన్నీళ్లతో సభాధ్యక్షుడిని వేడుకున్నారు. ఆయన ఏడ్వడంతో సభలో ఒక్కసారిగా నిశబ్ధ వాతావరణం ఏర్పడింది. తాను పేదోడినని…డబ్బు రికవరీ కాకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు సభలో. వెంటనే పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ సురేష్ కుమార్ ఖన్నా స్పందించారు. విచారణ జరిపించి న్యాయం చేస్తామని…ఎమ్మెల్యే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుకుంటే తప్పకుండా ఆ విధంగా చేస్తామన్నారు. 

Read Also : గ్లోబల్ ట్రెండ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్

Read Also : సందేహాలున్నాయి : ఎన్నికలకు ముందే దాడి వెనుక మతలబేంటి?

Read Also : వీడి ఐడియా తగలయ్యా : Wi-Fi పేరు ‘లష్కర్-ఈ-తాలిబన్’